Durandhar 2 OTT Sensation:రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్-2’ .మొన్నటి వరకు ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపించగా ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ ఊహించని రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ అద్భుతమైన టేకింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేశాయి.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ.1790 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. భారతీయ సినిమా చరిత్రలో అల్టిమేట్ బెంచ్‌మార్క్‌గా నిలిచిన అల్లు అర్జున్ గ్లోబల్ సెన్సేషన్ ‘పుష్ప-2: ది రూల్’ సృష్టించిన లైఫ్‌టైమ్ కలెక్షన్ల రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించడం విశేషం. థియేట్రికల్ రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్న ఈ యాక్షన్ ఎపిక్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈమధ్యే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం ‘జియో హాట్‌స్టార్’ వేదికగా జూన్ 5న డిజిటల్ ప్రీమియర్ అయిన దురంధర్-2 వీక్షకుల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన కేవలం మూడు రోజుల్లోనే అంటే వీకెండ్ ముగిసే సమయానికి ఏకంగా 5 కోట్ల మందికి పైగా ఈ సినిమాను చూసినట్టు ఆ ఓటీటీ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
also read :కార్తీ సినిమా షూటింగ్ కు బ్రేక్.. డైరెక్టర్ తో గొడవ నిజమేనా..?
థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్‌తో పాటు, మళ్లీ మళ్లీ చూడాలనుకునే సినిమా లవర్స్ ఈ చిత్రానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల రీజినల్ ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు అద్భుతమైన వ్యూయర్‌షిప్ వస్తుందని ఇన్ సైడ్ టాక్.
ఈ భారీ యాక్షన్ డ్రామాలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించి తన నటనతో ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ప్రతి పాత్రకు కథలో ఎంతో ప్రాధాన్యత ఉండటంతో పాటు, డైరెక్టర్ ఆదిత్య ధర్ రాసుకున్న స్క్రీన్‌ప్లే మైండ్ బ్లోయింగ్‌గా నిలిచింది.
also read :బట్టలు విప్పితేనే రొమాన్సా? ‘పెద్ది’ డైరెక్టర్‌కు జయా బచ్చన్, కరీనా కపూర్ గట్టి కౌంటర్!
గతంలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ఉరి.. ది సర్జికల్ స్ట్రైక్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆయన ఏంతో కాలం పాటు రీసెర్చ్ చేసి, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ‘దురంధర్’ ఫ్రాంచైజీని డిజైన్ చేశారు. రణ్‌వీర్ సింగ్‌ను ముందెన్నడూ చూడని సరికొత్త సాలిడ్ స్పై లుక్‌లో ప్రెజెంట్ చేసి సక్సెస్ అయ్యారు.
సాధారణంగా భారీ యాక్షన్ చిత్రాలకు ఓటీటీలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సస్పెన్స్, ఇంటెలిజెంట్ స్పై ఎలిమెంట్స్ ఉండటంతో యూత్ ఆడియన్స్ ఈ సినిమాను లూప్‌లో చూస్తున్నారు. జియో హాట్‌స్టార్ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో 50 మిలియన్ల వ్యూస్ సాధించిన ఏకైక రికార్డ్ సృష్టించిన చిత్రంగా దురంధర్-2 నిలిచింది. ఈ చిత్రం సాధిస్తున్న డిజిటల్ వ్యూస్ ప్రభంజనం చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని పాత రికార్డులు కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది.చూడాలి మరి రానున్న రోజుల్లో లాంగ్ రన్‌లో ఈ సినిమా మరెన్ని మిలియన్ల వ్యూస్ సాధిస్తుందో !
also read :షాకింగ్ ట్విస్ట్.. జయం రవికి కోర్టులో చుక్కెదురు.. ఆర్తి వేసిన భరణం కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్!