E-Paper
Advertisement

Manasa Varanasi: నేను చేసిన రొమాంటిక్ సీన్స్ చూసి.. మా ఫ్యామిలీ హర్టయింది

Manasa Varanasi: నేను చేసిన రొమాంటిక్ సీన్స్ చూసి.. మా ఫ్యామిలీ హర్టయింది
Advertisement

Manasa Varanasi: ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో తను పోషించిన పాత్ర చూసి, మొదట తమ వారణాసి ఫ్యామిలీ మొత్తం ఎంతో బాధపడిందని అన్నారు హీరోయిన్ మానస వారణాసి. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Frendly) సినిమాలో మానస వారణాసి (Manasa Varanasi) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మానస వారణాసి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలనే కాకుండా, తన సినీ ఎంట్రీపై ఫ్యామిలీ ఎలా రియాక్టైందో కూడా తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

Also Read- Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీపై డెక్కన్ కిచెన్ కేసు.. తదుపరి విచారణ ఎప్పుడంటే!

గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ కాదు

Advertisement

‘‘ఈ మూవీలో హీరోహీరోయిన్లు చాలా సన్నిహితంగా ఉండే సీన్స్ ఉంటాయి. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ, రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. మొదట చాలా సందేహించాను. కానీ మా డీవోపీ, డైరెక్టర్, హీరో సంతోష్.. ఇలా టీమ్ అంతా ప్రొఫెషనల్, చాలా హానెస్ట్‌గా కనిపించారు. ఆ సన్నివేశాలను అసభ్యకరంగా చిత్రీకరించరనే నమ్మకం కలిగింది. వారు కూడా ఈ విషయంలో నాకు కంఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. హీరో సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే.. నటిగా నేనూ ప్రొఫెషనల్‌గా ఉండాలి కదా.. అని ఆ సీన్స్‌కు ఓకే చెప్పి, నటించాను. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్‌గా, చాలా పొయెటిక్‌గా తెరకెక్కించారు. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ కాదు. కాకపోతే.. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మా ఇంట్లోని వారు నాతో కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. మన వారణాసి కుటుంబంలో ఉండి.. ఇలా ఎలా చేశావు? అని హర్టయ్యారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అర్థం చేసుకోసుకుని సపోర్ట్ చేశారు.

Also Read- Tollywood star heroes’ wives: బిజినెస్ రంగంలో రాణిస్తున్న తెలుగు స్టార్ హీరోల భార్యలు వీళ్లే..!

నా తమిళ యాస నచ్చలేదు

Advertisement

ఈ సినిమాను చెన్నై నగరంలో గెరిల్లా పద్ధతిలో షూట్ చేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. అక్కడ అందరూ నడుస్తూ వెళ్తుంటారు. మేము మా సీన్స్ చేయాలి. కెమెరా ఎక్కడ పెట్టారో తెలియదు. మాకు మేము నటించేసుకోవాలి. ఇలాంటి సీన్స్ చేయడం ఒక నటిగా నాకు చాలా కొత్తగా అనిపించింది. మా దర్శకుడిది తమిళనాడైనా ఆయనకు తెలుగు తెలుసు. అందుకే తెలుగు, తమిళం నేటివిటీకి నచ్చేలా డైలాగ్స్ రాశారు. నేను తమిళంలోనూ డబ్బింగ్ చెబుదామని ట్రై చేశాను, కానీ మా డైరెక్టర్‌కు నా తమిళ యాస నచ్చలేదు. నా నెక్ట్స్ మూవీ కోలీవుడ్‌లోనే చేస్తున్నా. తెలుగులోనూ స్టోరీస్ వింటున్నా. కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని, త్వరలోనే ప్రకటిస్తాను. ప్రస్తుతం యువతకు సందేశాన్నిచ్చేలా ఉండే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీస్ చేయాలని ఉంది. ఇంకా అన్ని జోనర్స్‌లోనూ సినిమాలు చేయాలని అనుకుంటున్నా’’ అని మానస చెప్పుకొచ్చారు.

Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ చుట్టూ ’42 రూల్స్’ సెగ.. ఇది ప్రోటోకాలా? లేక అహంకారమా?

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×