E-Paper
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ చుట్టూ ’42 రూల్స్’ సెగ.. ఇది ప్రోటోకాలా? లేక అహంకారమా?

Allu Arjun: ఐకాన్ స్టార్ చుట్టూ ’42 రూల్స్’ సెగ.. ఇది ప్రోటోకాలా? లేక అహంకారమా?

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్‌ని.. ఓ వింతైన వివాదం చుట్టేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 42 రూల్స్ లిస్ట్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పుష్ప అంటే తగ్గేదేలే.. రూల్స్ విషయంలోనూ అస్సలు తగ్గలేదుగా అంటూ సెటైర్లు పడుతున్నాయ్. అసలు ఈ ప్రోటోకాల్స్ వెనక ఉన్న కథేంటి? నిజంగానే బన్నీ చుట్టూ అంత కఠినమైన నిబంధనలు ఉన్నాయా? ఈ వివాదం ఎక్కడ మొదలైంది?

అల్లు అర్జున్ కలిసేటప్పుడు “42 రూల్స్”!

రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో.. కావేరి బారువు అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. తాను గతంలో అల్లు అర్జున్‌ని కలవడానికి వెళ్లినప్పుడు, ఆయన టీమ్ తనకు 42 కఠినమైన నిబంధనలతో కూడిన ఓ నోట్‌ని ఇచ్చారని ఆమె ఆరోపించారు. అల్లు అర్జున్‌ని కలిసేటప్పుడు ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, ఫోన్లు వాడొద్దని, ఐకాన్ స్టార్ చుట్టూ.. మూడు, నాలుగు లేయర్ల మేనేజర్లు ఉంటారని, ఒకరిని దాటి మరొకరిని కలవడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. ఈ వీడియో బయటకు రాగానే.. సోషల్ మీడియాలో బన్నీకి ఇంత అహంకారమా? అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలో 42 రూల్స్ లిస్ట్ కూడా చక్కర్లు కొట్టింది. అందులో కొన్ని రూల్స్ మరీ విడ్డూరంగా ఉండటంతో.. మరింత చర్చకు దారితీసింది. రూల్స్ లిస్ట్ చూస్తుంటే, ఇదొక స్టార్ హీరో ప్రోటోకాల్‌లా కాకుండా, ఏదో దేశాధినేత భద్రతా వలయంలా ఉందనే కామెంట్లు వచ్చాయ్.

అసత్య ఆరోపణలపై అల్లు అర్జున్ లీగల్ దాడి

ఈ ఆరోపణలు, విమర్శలు తీవ్రమవడంతో.. అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఈ 42 రూల్స్ కేవలం కట్టుకథలని, నిరాధారమైనవని కొట్టిపారేసింది. అల్లు అర్జున్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్న కావేరి బారువాపై, ఆ పాడ్‌కాస్ట్ నిర్వహించిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. వివాదం ముదరడంతో.. ఆ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని తొలగించింది. తనపై, తన గెస్ట్‌పై అల్లు అర్జున్ పీఆర్ టీమ్ సైబర్ ఎటాక్స్ చేస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయ్. ఈ వివాదంపై పుష్ప సినిమాలో నటించిన కో యాక్టర్స్ స్పందించారు. అల్లు అర్జున్ సెట్స్‌లో అందరితో కలిసి భోజనం చేస్తారని, ఆయన చాలా గ్రౌండెడ్ వ్యక్తి అని, 42 రూల్స్ అనేవి తప్పుడు ప్రచారమేనని మద్దతుగా నిలిచారు. ఇప్పటికే.. పుష్ప-2 రిలీజ్ టైమ్‌లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన బన్నీని బాగా కుంగదీసింది. అంతకుముందు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం పెద్ద దుమారానికి దారితీసింది. ఇప్పుడేమో ఈ వివాదం! ఇలా ఒకటి మర్చిపోయే లోపు, మరొకటి.. వరుసగా అల్లు అర్జున్‌ని చుట్టు ముట్టేస్తుండటంతో.. ఇదంతా ఎవరైనా కావాలనే టార్గెట్ చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయ్.

పాన్ ఇండియా విజయానికి వెనుక బన్నీ వ్యూహం

ఈ కాంట్రవర్శీలన్నీ కాసేపు పక్కనబెడితే.. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ జర్నీ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఒకప్పుడు మెగా కాంపౌండ్ హీరో అనే ముద్రతో కెరీర్ మొదలుపెట్టిన బన్నీ.. ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్. పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం వెనుక గొప్ప వ్యూహం, అంతకుమించిన కష్టం ఉన్నాయ్. మెగా కాంపౌండ్ అనే ముద్ర నుంచి బయటకొచ్చి, తనకంటూ సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. మెగా హీరోలంటే.. సాధారణంగా మాస్ ఇమేజ్‌పై ఫోకస్ చేస్తారు. కానీ.. బన్నీ ముందు నుంచే స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్‌ని ఎంచుకున్నాడు. చిరంజీవి తర్వాత టాలీవుడ్‌లో డ్యాన్స్‌ని ఓ సెలబ్రేషన్‌లా మార్చింది బన్నీనే. అతను వేసే గ్రేస్ ఫుల్ స్టెప్స్.. యూత్ ఆడియెన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయ్. మెగా ఇమేజ్ హీరోలు కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేస్తుంటారు.

టాలీవుడ్ నుంచి నేషనల్ స్టార్ వరకు

కానీ.. బన్నీ ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు. కెరీర్ ట్రాక్‌లో పడుతున్నప్పుడే.. వేదం మూవీలో కేబుల్ రాజు పాత్ర చేసి మెప్పించాడు. హీరోగా ఉంటూనే.. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. ఇక్కడే.. తన ఇమేజ్ కంటే కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని నిరూపితమైంది. టాలీవుడ్ హీరోల్లో కేరళలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరో అల్లు అర్జునే. అక్కడి ప్రేక్షకులు.. బన్నీని.. మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. నార్త్ ఇండియాలోనూ డబ్బింగ్ సినిమాలతో.. అక్కడి ప్రేక్షకులకు కూడా రీచ్ అయ్యాడు. ఇదే.. పుష్ప సినిమాకు హిందీలో వసూళ్లు రావడానికి బేస్ వేసింది. అలా.. తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని, తగ్గేదేలే అనే మేనరిజంతో పుష్పతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న తొలి హీరోగా రికార్డు సృష్టించి, ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు.

బన్నీకి రొటీన్‌లా అవుతున్న ‘టార్గెట్’ ట్రోల్స్

ఇదే క్రమంలో.. అల్లు అర్జున్‌ని చుట్టూ నడిచిన వివాదాలు.. ఈ మధ్యకాలంలో ఏ టాలీవుడ్ హీరోని తాకలేదు. నంద్యాలలో వైసీపీ కోసం ప్రచారమైనా, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట అయినా, ఇప్పుడు.. 42 రూల్స్ ప్రోటోకాల్ అయినా.. బన్నీని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. వీటికి బోనస్‌గా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, ఇతర హీరోల ఫ్యాన్స్‌కి మధ్య నిత్యం.. వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తూనే ఉంటాయ్. అసలు.. అల్లు అర్జున్ చుట్టే ఎందుకు ఇన్ని వివాదాలు వస్తున్నాయ్? ఇదంతా.. యాక్సిడెంటల్‌గానే జరుగుతోందా? లేక ఎవరైనా బన్నీ ఇమేజ్‌ని డౌన్ చేసేందుకు.. టార్గెట్ చేసి చేస్తున్నారా? అనే డౌట్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయ్.

బన్నీ ఆటిట్యూడ్ మారిందా? ఇండస్ట్రీలో చర్చ

తగ్గేదేలే.. పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ఇండియా వైడ్ పాపులర్ అయింది. పుష్ప తెచ్చిన క్రేజ్, పాపులారిటీ తర్వాత.. బన్నీ ఆటిట్యూడ్ మారిందనే చర్చ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఈ 42 రూల్స్ ప్రోటోకాల్ కూడా.. ఆ కోవలోకి చెందిందే అంటున్నారు. అది వాస్తవమా? కాదా? అనేది పక్కనపెడితే.. ఎంతో, కొంత నిజం లేకుండా.. ఇలాంటివి బయటకు రావనే టాక్ వినిపిస్తోంది. పైగా.. ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.. టాలీవుడ్‌కి చెందినవారు కూడా కాదు. బాలీవుడ్‌కి చెందిన కావేరి. ఇక్కడి వాళ్లైతే.. బన్నీని బ్లేమ్ చేసేందుకే ఇలా చేశారనుకోవచ్చు. కానీ.. అక్కడికి వాళ్లకి ఏమి అవసరం. అందువల్ల.. ఆవిడ చెప్పినదాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

పాత బంధాల్ని మించిన కొత్త సామ్రాజ్యం

పుష్ప గ్రాండ్ సక్సెస్ తర్వాత.. ఓ ప్రాంతీయ హీరో నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగే క్రమంలో కాన్ఫిడెన్స్ పెరగడం సహజమే. కానీ.. అది అహంకారంగా మారితేనే ఇబ్బంది. గతంలో నంద్యాల పర్యటన సమయంలో తలెత్తిన వివాదం, హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన లాంటివి.. ఐకాన్ స్టార్ ఇమేజ్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపాయి. దాంతో.. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి అనే సూచనలు ఎక్కువగా వినిపిస్తున్నాయ్. మెగా కాంపౌండ్ హీరో లేబుల్‌తో వచ్చిన బన్నీ.. ఇప్పుడు తనకంటూ ఓ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకునే క్రమంలో.. పాత బంధాలను, సంప్రదాయాలను పక్కనపెడుతున్నారని కొందరు భావిస్తున్నారు. అందుకే.. ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఒక స్టార్ హీరో ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎదుగుతున్న క్రమంలో.. కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్, పీఆర్ స్ట్రాటజీలు ఉంటాయి. కానీ.. అవి మరీ టూ మచ్‌గా ఉండటం మీదే ఇంత రచ్చ.

అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదం.. హీరోకి తెలిసి కాదా?

తాజా వివాదంపై ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ లిస్టు అల్లు అర్జున్ స్వయంగా తనకు తానుగా పెట్టుకున్నది కాదు. పీఆర్ టీమ్ అతి వల్లే.. ఇలాంటి వివాదం తలెత్తిందని అంటున్నారు. సాధారణంగా స్టార్స్ బయటకొచ్చినప్పుడు, వారిని చూడటానికి జనం ఎగబడతారు. ఆ తోపులాటలో స్టార్‌ హీరోకి ఇబ్బంది కలగకుండా.. పీఆర్ టీమ్స్ కొన్ని అంతర్గత గైడ్‌లైన్స్ పెట్టుకుంటాయ్. ఇప్పుడు.. రూల్సే లీక్ అయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ 42 రూల్స్ మరీ ఓవర్‌గా అనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇది ఎవరో కావాలని సృష్టించిన ప్రోటోకాల్‌లా కనిపిస్తోందంటున్నారు. నిజానికి, సెలబ్రిటీల కంటే వారి చుట్టూ ఉండే మేనేజ్‌మెంట్ టీమ్స్ చేసే అతి వల్లే ఇలాంటి వివాదాలు వస్తాయి. హీరోకి తెలియకుండానే కింద ఉన్న సిబ్బంది, ఈవెంట్ ఆర్గనైజర్లు తమ అధికారాన్ని ప్రదర్శించడానికి ఇలాంటి కఠిన నిబంధనలు పెడుతుంటారు. చివరికి అది హీరో ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాక గానీ రియలైజ్ అవరు.

అల్లు అర్జున్ వివాదం.. ఫ్యాన్స్‌కి మధ్య దూరం పెరుగుతున్నదా?

ఏదేమైనా సరే.. హీరోలైనా, స్టార్ హీరోలైనా.. ఎదిగేకొద్దీ.. ఒదిగి ఉండాలి. వారి చుట్టూ ఉండే వలయం.. హీరో ఎవరితో కనెక్ట్ కాకుండా, కాంటాక్ట్ అవకుండా చేస్తే.. అది ఫ్యాన్స్‌కి, హీరోకి మధ్య దూరాన్ని పెంచుతుంది. సెలబ్రిటీలు కూడా తమ ఆటిట్యూడ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పటివరకు ఈ వివాదంపై అధికారికంగా స్పందించలేదు. ఆయన టీమ్ మాత్రం.. ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. మరోవైపు, ఈ వివాదం అల్లు అర్జున్, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. స్టార్‌డమ్ అనేది రెండంచుల కత్తి. విజయం పెరిగేకొద్దీ ప్రతి చిన్న కదలికపై నిఘా ఉంటుంది. అల్లు అర్జున్ విషయంలో వస్తున్న విమర్శలు ఆయన ఎదుగుదలని అడ్డుకునే స్పీడ్ బ్రేకర్ల లాంటివి. అయితే.. అల్లు అర్జున్‌పై జరుగుతున్న ప్రచారంపై.. జనంలో ఉన్న అనుమానాలను తొలగించడానికి మరింత స్పష్టమైన వివరణ రావాల్సిన అవసరం ఉంది.

Also Read: డాలర్ పెరిగితే రూపాయి ఎందుకు పడిపోతుంది? దీని వెనుక ఉన్న లాజిక్ ఇదే!

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×