E-Paper
Advertisement

India vs Namibia: న‌మీబియాపై టీమిండియా విజ‌యం..పాక్ కంటే ముందే సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

India vs Namibia: న‌మీబియాపై టీమిండియా విజ‌యం..పాక్ కంటే ముందే సూప‌ర్ 8లోకి ఎంట్రీ !
Advertisement

India vs Namibia:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా గురువారం ఇండియా వర్సెస్ నమీబియా జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా, మరో పసికూడా నమీబియాపై గాండ్రించింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా, నబిబియా ను చిత్తు చేసి.. సూపర్ 8 ప్లేస్ ఖరారు చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన 18వ మ్యాచ్ లో ఇండియా ఏకంగా 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియా విధించిన 210 పరుగుల టార్గెట్ ను చేదించే క్రమంలో నమీబియా చేతులు ఎత్తేసింది. ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో18.2 ఓవ‌ర్లు ఆడింది న‌మీబియా. ఈ త‌రుణంలోనే 116 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇండియా విజయం సాధించింది.

Also Read: BAN – T20 WC Boycott: మా బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు, పిరికి స‌న్నాసులు..మాట మార్చిన ఆసిఫ్ నజ్రుల్

ఇండియన్ ఆదుకున్న ఇషాన్ కిషన్, పాండ్య

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఇండియా వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడినప్పటికీ, మొదట ఇండియా బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్ణిత 20 ఓవర్లు ఆడింది ఇండియా. ఈ నేపథ్యంలోనే తొమ్మిది వికెట్లు నష్టపోయిన టీమిండియా 209 పరుగులు సాధించింది. టీమిండియా జట్టులో ఓపెనర్ ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు అలాగే ఆరు బౌండరీలు ఉన్నాయి. 254.17 స్ట్రైక్ రేట్ తో ఇషాన్ కిషన్ ఇరగదీశాడు. అటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 28 బందుల్లో 52 పరుగులు బాదేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. అభిషేక్ శర్మ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ 8 బంతుల్లో 22 పరుగులు కొట్టాడు. తిలక్ వర్మ 25 పరుగులు చేయగా శివం దుబే 23 పరుగులతో ఆదుకున్నాడు. దీంతో 209 పరుగులు సాధించింది ఇండియా. ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో18.2 ఓవ‌ర్లు ఆడింది న‌మీబియా. ఈ త‌రుణంలోనే 116 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది.

సూపర్ 8 లోకి దూసుకెళ్లిన ఇండియా !

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో సూపర్ 8 లోకి ఇండియా దూసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన ఇండియా ఖాతాలో నాలుగు పాయింట్లు పడ్డాయి. అటు పాకిస్తాన్ ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. కానీ ఇండియా రన్ రేట్ ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఇండియా మిగిలిన మ్యాచ్ లలో ఒక్క‌టి గెలిచి, మిగిలినవి  ఓడిపోయినప్పటికీ రన్ రేట్ ప్రకారం సూపర్ 8 కు పాకిస్తాన్ కంటే ముందే వెళ్ళనుంది. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ లో ఏ జ‌ట్టు గెలిచినా, అధికారికంగా ఓ టీమ్ సూప‌ర్ 8 కు వెళ్ల‌నుంది.

Advertisement

Also Read: Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×