E-Paper
Advertisement

Manasa Varanasi: శ్రీలీలను రీప్లేస్ చేస్తుందా? ఎంక్వైరీలు మొదలయ్యాయట!

Manasa Varanasi: శ్రీలీలను రీప్లేస్ చేస్తుందా? ఎంక్వైరీలు మొదలయ్యాయట!
Advertisement

Manasa Varanasi: టాలీవుడ్‌లో హీరోయిన్ల జాతకాలు మారడానికి ఒక్క సినిమా చాలు. నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన భామలు ఒక్కసారిగా కనుమరుగవ్వడం, కొత్త నీరు వచ్చి చేరడం ఇక్కడ చాలా కామన్. ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోన్న పేరు ‘మానస వారణాసి’ (Manasa Varanasi). అందాల పోటీల వేదిక నుంచి వెండితెరకు పరిచయమైన ఈ భామ, ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) ప్లేస్‌ను రీప్లేస్ చేయబోతుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మానస వారణాసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కానీ, తాజాగా సంతోష్ శోభన్ సరసన ఆమె నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) సినిమా ఆమె దశను మార్చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం దిశగా దూసుకెళ్తుండటంతో పాటు, అందులో మానస పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. దీంతో అందరూ ఆమె గురించే చర్చించుకుంటున్నారు.

Also Read- Manchu Lakshmi: మనకంటే అన్నీ అయిపోయాయ్ కాబట్టి.. ఆ పదం బూతుగా వినిపిస్తుంది

శ్రీలీల హవాకు బ్రేక్ పడిందా?

Advertisement

గత ఏడాది వరకు టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపించేది. కానీ, వరుస పరాజయాలు ఆమె గ్రాఫ్‌ను కాస్త తగ్గించాయి. ప్రస్తుతం ఆమె హవా తగ్గిన తరుణంలో, మేకర్స్ కొత్త ముఖాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో మానస వారణాసి క్లిక్ అవ్వడం ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారింది. శ్రీలీల తరహాలోనే అందం, అభినయం కలగలిసిన మానస.. ఆమె స్థానాన్ని భర్తీ చేయగలదని టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. కాకపోతే శ్రీలీల డ్యాన్సింగ్‌ని ఈ భామ మ్యాచ్ చేయడం కష్టమనే చెప్పుకోవాలి. అయినా కూడా శ్రీలీలకు లక్ కలిసి రావడం లేదు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా హిట్టయితే.. మళ్లీ కొన్నాళ్ల పాటు ఆమె హవా నడుస్తోంది. లేదంటే, మానసకు పూర్తి స్థాయిలో దారి దొరికేసినట్టే అని చెప్పుకోవాలి.

Also Read- Pawan Kalyan: పవన్ సురేందర్ రెడ్డి సినిమాలో అక్కినేని హీరోయిన్… షూటింగ్ ఎప్పుడంటే?

నిర్మాతల క్యూ.. నెక్స్ట్ ఏంటి?

Advertisement

ప్రస్తుతం మానస వారణాసికి వస్తోన్న పాపులారిటీని చూసి పెద్ద బ్యానర్లు, స్టార్ దర్శకులు ఆమె కోసం ఎంక్వైరీలు మొదలుపెట్టారట. ఇప్పటికే రెండు, మూడు క్రేజీ ప్రాజెక్టుల చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. మిస్ ఇండియాగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హైదరాబాదీ భామ, ఇప్పుడు సినిమాల్లో కూడా తన సత్తా చాటాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది. మరి రాబోయే రోజుల్లో మానస ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరిస్తుందో, శ్రీలీల రేంజ్‌ను అందుకుంటుందో లేదో చూడాలి.

Also Read- Varun Tej: చెల్లెలి ఫోన్ కట్.. లావణ్య ఫోన్ మాత్రం లిఫ్ట్.. అడ్డంగా బుక్ అయిపోయిన వరుణ్ తేజ్..!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×