E-Paper
Advertisement

Peddi Movie: డోంట్ ట్రాప్.. ‘దూల తీర్చి దూపం వేస్తున్నాం..’.. ట్రెండ్ బద్దలవుతోంది!

Peddi Movie: డోంట్ ట్రాప్.. ‘దూల తీర్చి దూపం వేస్తున్నాం..’.. ట్రెండ్ బద్దలవుతోంది!
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమాను వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. చిత్రీకరణకు సంబంధించి కూడా ఆలస్యమవడంతో నిర్మాతలు ఈ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు.. లేదంటే, రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు యూనిట్ ఎటువంటి ప్రమోషన్స్ నిర్వహించకపోయినా, ఈ మధ్యకాలంలో ‘పెద్ది’ పేరు ప్రతి రోజూ ట్రెండ్‌ను బద్దలు కొడుతూనే ఉంది.

Also Read- Actress Anshu: ఫ్రెండ్స్‌తో కలిసి నాగార్జున హీరోయిన్ అందాల విందు.. ఫొటోలు వైరల్!

దూల తీర్చి దూపం వేస్తున్నాం

Advertisement

తాజాగా ‘పెద్ది మూవీ’ అనే ఎక్స్ వేదికగా డోంట్ ట్రాప్ అంటూ ఓ ఇమేజ్‌ను వదిలారు. ఈ ఇమేజ్‌పై క్లిక్ కొడితే వేరే ఇమేజ్ ప్రత్యక్షమవుతోంది. రామ్ చరణ్ కంటి దగ్గర మాత్రం రెడ్ కలర్‌లో షేడ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్ట్‌కు ‘దూల తీర్చి దూపం వేస్తున్నాం..’ (#DhoolaTheerchiDhupamEsthunnam) అనే ట్యాగ్‌ని జోడించారు. ఈ డైలాగ్ సినిమాలో ఉంటుందనే విషయాన్ని.. ఇటీవల బుచ్చిబాబు షూటింగ్‌లో చెబుతూ క్లారిటీ ఇచ్చారు. దీంతో దీనినే ట్రెండ్ చేస్తున్నారు. అవును, ‘దూల తీర్చి దూపం వేస్తున్నాం..’ ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కోసం బుచ్చిబాబు డైలాగ్స్ కూడా చాలా స్పెషల్‌గా ఉండేలా చూసుకున్నట్లుగా తన తాజా ఇంటర్వ్యూలో చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడిలాంటి డైలాగ్స్ రెండు వస్తే మాత్రం.. ఇక ‘పెద్ది’ని పట్టుకోవడం ఎవరితరం కాదు.

Also Read- Manasa Varanasi: శ్రీలీలను రీప్లేస్ చేస్తుందా? ఎంక్వైరీలు మొదలయ్యాయట!

అదే జరిగితే.. బుచ్చిబాబుకు గుడే!

Advertisement

ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో ఓ రేంజ్‌లో బిజినెస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడనేలా వైబ్ నడుస్తుంది. అదే జరిగితే.. బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ గుడి కట్టినా కట్టేస్తారు. ఆ వైబ్‌ని కలిగించింది మాత్రం ‘చికిరి చికిరి’ సాంగే అని చెప్పుకోవాలి. ఇందులో రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి స్టార్ యాక్టర్స్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read- Manchu Lakshmi: మనకంటే అన్నీ అయిపోయాయ్ కాబట్టి.. ఆ పదం బూతుగా వినిపిస్తుంది

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×