E-Paper
Advertisement

Varun Tej: చెల్లెలి ఫోన్ కట్.. లావణ్య ఫోన్ మాత్రం లిఫ్ట్.. అడ్డంగా బుక్ అయిపోయిన వరుణ్ తేజ్..!

Varun Tej: చెల్లెలి ఫోన్ కట్.. లావణ్య ఫోన్ మాత్రం లిఫ్ట్.. అడ్డంగా బుక్ అయిపోయిన వరుణ్ తేజ్..!
Advertisement

Varun Tej: తెలుగు ఛానల్‌లో ప్రసారమవుతున్న ఆట డ్యాన్స్ రియాలిటీ షోకు సంబంధించిన తాజా ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో జరిగిన సరదా సంఘటనలు ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సెలబ్రిటీల హాజరు ఈ ప్రోమోకు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.

ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కు మెగా డాటర్ నిహారిక కొనిదెలతో పాటు.. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన.. హీరోయిన్ అలానే వరుణ్ తేజ్ భార్య అయినటువంటి లావణ్య త్రిపాఠి కూడా వచ్చారు. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా ఆమె ఇలా ఒక టీవీ ప్రోగ్రామ్‌లో కనిపించడం కూడా ఆసక్తికరంగా మారింది.

Advertisement

ఈ సందర్భంగా షో హోస్ట్ సుడిగాలి సుధీర్ ఒక సరదా గేమ్ పెట్టారు. “వరుణ్ తేజ్ ఎవరి ఫోన్ ఎత్తుతారు?” అంటూ పోటీ పెట్టారు. ఒకవైపు చెల్లెలు నిహారిక ఫోన్ చేస్తే, మరోవైపు భార్య లావణ్య ఫోన్ చేస్తే ఎవరి కాల్‌కు స్పందిస్తారో చూద్దాం అంటూ అందరినీ ఉత్కంఠలో పెట్టారు.

ముందుగా నిహారిక వరుణ్ తేజ్‌కు ఫోన్ చేసింది. కానీ వరుణ్ తేజ్ ఆ కాల్‌ను కట్ చేస్తూ ఉండటాన్ని అందరూ గమనించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నవ్వులు ఆపుకోలేకపోయారు. వెంటనే నిహారిక, “అయితే వదిన లావణ్య ఫోన్ చేయి” అంటూ సరదాగా చెప్పింది.

Advertisement

లావణ్య త్రిపాఠి ఫోన్ చేయగానే, కేవలం ఒక్క రింగు కూడా పూర్తిగా మోగకముందే వరుణ్ తేజ్ వెంటనే కాల్ ఎత్తేశారు. ఈ సీన్ చూసిన ప్రేక్షకులు, అక్కడున్న సెలబ్రిటీలంతా ఒక్కసారిగా నవ్వేశారు. అప్పుడు నిహారిక సరదాగా, “నా ఫోన్ ఎత్తకుండా వదిన ఫోన్ మాత్రం ఎత్తుతావా?” అంటూ ప్రశ్నించింది.

దానికి వరుణ్ తేజ్ ఇచ్చిన సమాధానం అసలు హైలైట్. “నేను బాబు డైపర్ మార్చుతున్నాను” అంటూ చెప్పడంతో స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగింది. ఆ తర్వాత సుధీర్ కూడా లావణ్యకు ఫోన్ చేసి సరదాగా కామెంట్లు చేయడంతో వాతావరణం మరింత హుషారుగా మారింది.

ALSO READ: Venkatesh Multi Starrer: వెంకటేష్ సినిమాలో తమిళ స్టార్ హీరో.‌. ఎవరంటే..!

Related News

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×