E-Paper
Advertisement

Manchu Lakshmi: మనకంటే అన్నీ అయిపోయాయ్ కాబట్టి.. ఆ పదం బూతుగా వినిపిస్తుంది

Manchu Lakshmi: మనకంటే అన్నీ అయిపోయాయ్ కాబట్టి.. ఆ పదం బూతుగా వినిపిస్తుంది
Advertisement

Manchu Lakshmi: ఒక బూతు పదానికి ఎంతో మంచి అర్థాన్ని చెప్పారు డైనమిక్ లేడీ మంచు లక్ష్మి (Manchu Lakshmi). అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్లుగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బూకి’ (Bookie). విజయ్ ఆంటోనీ (Vijay Antony) సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే తమిళ్‌లో ‘పూకి’ పేరుతో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంటోంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంచు లక్ష్మి మీడియా అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ముఖ్యంగా తమిళ టైటిల్‌, తెలుగు టైటిల్‌కు చాలా తేడా ఉంది కదా.. అని మీడియా అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి ఇచ్చిన సమధానం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే..

Also Read- Pawan Kalyan: పవన్ సురేందర్ రెడ్డి సినిమాలో అక్కినేని హీరోయిన్… షూటింగ్ ఎప్పుడంటే?

క్యూట్ అని అర్థం

Advertisement

‘‘అసలు ‘పూకి’ అనేది కూడా ఒక స్లాంగ్ అండి. ఈ రోజుల్లో దీనికి అర్థం చెప్పాలంటే క్యూటీ అని అనొచ్చు. మీకు, నాకు ఏజ్.. అన్నీ అయిపోయాయ్ కాబట్టి తెలియడం లేదు కానీ, ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌కి ఇది చాలా వాడుకైన పదమట. వాళ్లకి అర్థం తెలుసు కాబట్టి తమిళ్ వాళ్లు దీనిని బాగానే తీసుకున్నారు. సినిమా అక్కడ చాలా బాగా ఆడుతుంది’’ అని చెప్పుకొచ్చారు. నిజమే ఈ మధ్యకాలంలో బూతులు కూడా చాలా ఫ్యాషన్ అయిపోయాయి. పబ్లిగ్గానే ఎవరు పడితే వాళ్లు వాడేస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. బూతు పదం లేకుండా మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి చెప్పేది చూస్తుంటే.. దీనిని బూతుగా చూస్తే బూతు అనిపిస్తుంది. లేదంటే క్యూట్ అనిపిస్తుందనేలా ఆమె చెబుతోంది.

Also Read- Manchu Lskshmi: మంచు లీక్స్… శ్రీనివాస మంగాపురంలో మోహన్ బాబు.. క్యారెక్టర్ లీక్ చేసిన మంచు లక్ష్మి!

చాలా గమ్మత్తుగా ఉంటాయి

Advertisement

ఇక ఈ సినిమా గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘గత శుక్రవారం ఈ సినిమా తమిళ్‌లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ని అందుకుంది. ఇది యూనివర్సల్‌గా కరెక్ట్ అయ్యే సినిమా. అజయ్, ధనుషా ఇలా మంచి టీమ్‌తో కలిసి చేసిన సినిమా. విజయ్ ఆంటోని ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారంటే ఆ కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ గణేష్ చంద్రకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన క్యారెక్టర్ చేశాను. ఇందులో నా పాత్రకు ఉండే ఎక్స్‌ప్రెషన్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ సినిమా తమిళ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. ఇది యూత్ ఫుల్ సినిమా. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’’ అని అన్నారు.

Also Read- Varun Tej: చెల్లెలి ఫోన్ కట్.. లావణ్య ఫోన్ మాత్రం లిఫ్ట్.. అడ్డంగా బుక్ అయిపోయిన వరుణ్ తేజ్..!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×