E-Paper
Advertisement

Manchu Vishnu: నయనతార కావాలన్న ఎంపీపై మంచు విష్ణు ఫైర్..

Manchu Vishnu: నయనతార కావాలన్న ఎంపీపై మంచు విష్ణు ఫైర్..
Advertisement

Manchu Vishnu: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన నయనతార (Nayanthara) పేరు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగా AIADMK పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.వి. శణ్ముగం విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేవిగా ఉన్నాయని డీఎంకే పార్టీ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. మహిళలను శక్తి స్వరూపిణిగా భావించి, గౌరవించే చోట.. కేవలం రాజకీయ లబ్ధి కోసం, జనాల్లో వైరల్ అవడం కోసం ఒక నటిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, మర్యాద తెలుసుకుని మాట్లాడాలని మంచు విష్ణు హితవు పలికారు.

Also Read- Harish Shankar: ‘ఉస్తాద్’లో పార్థిబన్ ఎందుకు?.. జర్నలిస్ట్‌కు ఇచ్చిపడేసిన హరీష్ శంకర్!

మహిళలను శక్తి స్వరూపిణిగా గౌరవిస్తాం

Advertisement

‘‘తమిళనాడులో జరుగుతున్న రాజకీయ ప్రచారాల కోసం ఏ సంబంధం లేని నటీమణులను లాగడం చూస్తుంటే వాళ్లెంత తక్కువ స్థాయి వ్యక్తులో అర్థమవుతోంది. ఇది కేవలం తమిళనాడులోనే (Tamil Nadu Politics) కాదు, అన్ని చోట్ల ఇదే పద్ధతి కనిపిస్తోంది. నటీనటులు రాజకీయ విమర్శలకు వేదికలు కాదు. వారికి కూడా తెర వెనుక కుటుంబం, ఆత్మగౌరవం, వ్యక్తిగత జీవితం ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడే సమయంలో మర్యాద మరిచిపోయి మాట్లాడకూడదు. ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ చేయకూడదు. భారతీయ సంస్కృతి మూలాల్లో మహిళలను శక్తి స్వరూపిణిగా భావించి గౌరవిస్తాం. అంతేకానీ వారిని కేవలం వార్తల్లో హెడ్‌లైన్స్ కోసమో లేదంటే అవమానాలకో పరిమితం చేయకండి. కనీసం ఇకనైనా మారుదాం..’’ అని మంచు విష్ణు ఎక్స్ వేదికగా సదరు ఎంపీని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Horror Movie OTT: కాటి నుంచి కదిలొచ్చిన కసాయి తండ్రి… కన్నబిడ్డలనూ వదలని కొరివి దెయ్యం

అప్పుడేమైపోయావ్..

Advertisement

ఇక ఈ పోస్ట్‌కు నెటిజన్ల కామెంట్స్ ఇంకో రకంగా ఉన్నాయి. ఏపీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ల అమ్మని, భార్యని ఎన్నో మాటలు అన్నారు. అప్పుడేం చేస్తున్నావ్.. అంటూ మంచు విష్ణుని ప్రశ్నిస్తున్నారు. నిజంగా నీకు నిజాయితీగా స్పందించే గుణం ఉంటే, అప్పుడు ఏమైపోయావ్, ఏ వాళ్లు ఆడవాళ్లు కాదా? అంటూ నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ విష్ణుని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే మరి, ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి. అందులోనూ ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడందరినీ సమానంగానే చూడాలి. సమయాన్ని బట్టి, మనుషులను బట్టి మారతాను, మాట్లాడతాను అంటే.. ఇలాగే కామెంట్స్ పడతాయ్ మరి. కాబట్టి మంచు విష్ణు కూడా మారాలి.. అనేలా నెటిజన్ల కామెంట్స్ ఉన్నాయి.

Also Read- Hema and Surekha Vani: కల్లు తాగుతూ.. హేమ, సురేఖ వాణి హల్‌చల్.. వీడియో వైరల్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×