E-Paper
Advertisement

Harish Shankar: పవన్ కళ్యాణ్ కాకుండా హరీష్‌కు ఇంకా ఏ హీరో ఇష్టమో తెలుసా?

Harish Shankar: పవన్ కళ్యాణ్ కాకుండా హరీష్‌కు ఇంకా ఏ హీరో ఇష్టమో తెలుసా?
Advertisement

Harish Shankar: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ప్రమోషన్స్‌లో యమా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. ఇలా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరని అడగ్గా.. ఏమాత్రం తడబడకుండా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పేరు చెప్పారు. ఒకవేళ తను ఒక్క రోజైనా హీరోగా నటించాల్సి వస్తే, కచ్చితంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) స్టైల్‌నే అనుకరిస్తానని హరీష్ శంకర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. నిజంగా ఇది ఎవరూ ఊహించని పేరనే చెప్పుకోవాలి. బహుశా, టాలీవుడ్‌లో వేరే హీరో పేరు చెబితే.. ఇతర హీరోల ఫ్యాన్స్ హర్ట్ అవుతారని అలా చెప్పి ఉంటాడని అంతా అనుకుంటున్నారు కానీ, నిజంగానే హరీష్‌కు షారుఖ్ అంటే ఇష్టం.. ఈ విషయం ఆయన చాలా సార్లు చెప్పారు.

Also Read- Manchu Vishnu: నయనతార కావాలన్న ఎంపీపై మంచు విష్ణు ఫైర్..

ఆ ఆణిముత్యాలను పదే పదే చూస్తా..

Advertisement

ఇక ప్రస్తుత తరం దర్శకులలో మీకు ఎవరు ఇష్టమనే ప్రశ్నకు, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరును ఆయన ప్రస్తావించారు. సందీప్ మేకింగ్ స్టైల్, ఆయన విజన్ తనకు చాలా ఇష్టమని హరీష్ చెప్పుకొచ్చారు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, క్లాసిక్ సినిమాల పట్ల కూడా ఆయనకు ఉన్న మక్కువ బయటపడింది. ఒకవేళ రోజంతా పదే పదే ఒకే సినిమా చూడాల్సి వస్తే.. తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలైన ‘మాయా బజార్’ లేదంటే, ‘సాగర సంగమం’ చిత్రాలను ఎన్నిసార్లైనా చూస్తానని ఆయన తన అభిరుచిని చాటుకున్నారు. హరీష్ శంకర్ మాటలను బట్టి చూస్తే ఆయనకు మాస్ సినిమాలపై ఎంత పట్టు ఉందో, క్లాసిక్ సినిమాలపై అంతటి గౌరవం ఉందని అర్థమవుతోంది.

Also Read- Harish Shankar: ‘ఉస్తాద్’లో పార్థిబన్ ఎందుకు?.. జర్నలిస్ట్‌కు ఇచ్చిపడేసిన హరీష్ శంకర్!

ఎన్ని చెప్పినా, ఆ పేరు వింటే పూనకమే!

Advertisement

షారుఖ్ ఖాన్ లాంటి గ్లోబల్ స్టార్‌ను ఆరాధించడం, సందీప్ వంగా వంటి బోల్డ్ డైరెక్టర్‌ను ఇష్టపడటం ఆయన క్రియేటివ్ థింకింగ్‌ను ప్రతిబింబిస్తోంది. ఆయన ఎవరి పేరు చెప్పినా, పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడితే చాలు, పూనకాలు రావడం పక్కా. ఇది, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనని ఫాలో అయ్యే అందరికీ తెలుసు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా బాక్సాఫీస్ వద్ద ‘గబ్బర్ సింగ్’లా పేలితే మాత్రం.. ఫ్యాన్స్ గుండెల్లో చెదరని స్థానం హరీష్‌కు దక్కుతుందనేది కాదనలేని నిజం. చూద్దాం మరి, ఎలాంటి వండర్స్‌ని ఈ సినిమా క్రియేట్ చేస్తుందో? ఈ సినిమా కోసం అటు పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 19న ఉగాది స్పెషల్‌గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Also Read- Renu Desai: రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు.. ఇద్దరిపై సైబర్ క్రైమ్ కేసు

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×