E-Paper
Advertisement

Markandeya Title Glimpse: అప్పుడు మొదలవుతుంది ఆయన ఆట.. గ్లింప్స్‌కి గూస్‌బంప్స్!

Markandeya Title Glimpse: అప్పుడు మొదలవుతుంది ఆయన ఆట.. గ్లింప్స్‌కి గూస్‌బంప్స్!
Advertisement

Markandeya Title Glimpse: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఎస్వీసీ బ్యానర్‌ (SVC Banner)పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. శిరీష్‌తో కలిసి ఆయన ఈ బ్యానర్‌పై సినిమాలు చేస్తున్నారు. ఇది టాలీవుడ్‌లోనే టాప్ బ్యానర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ బ్యానర్ కాకుండా ఇటీవల దిల్ రాజు తన సొంత బ్యానర్ అని చెప్పి ఓ బ్యానర్‌ను స్టాపించారు. అదే దిల్ రాజు డ్రీమ్స్ (DRD). ఈ బ్యానర్‌ (DilRaju Dreams) నుంచి ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా రూపుదిద్దుకుంటోన్న సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్‌తో సహా వదిలి, దిల్ రాజు స్ట్రాటజీ ఏంటనేది తెలియజేశారు. ఈ మధ్యకాలంలో దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు అంతగా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోవడం లేదు. సినిమా జడ్జిమెంట్‌లో తిరుగులేని దిల్ రాజు.. గత కొన్ని సినిమాలుగా తడబడుతూనే ఉన్నారు. అందుకే, తక్కువ బడ్జెట్‌లో దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌పై సినిమాలు చేయాలనేలా ప్లాన్ బి‌ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిన ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రానికి ‘మార్కండేయ’ (Markandeya) అనే టైటిల్‌ని ఖరారు చేసి, గ్లింప్స్ (Markandeya Title Glimpse) వదిలారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే..

Also Read- Manasa Varanasi: మిస్ ఇండియా విన్నర్‌కు డబ్బులు ఇవ్వరు.. ఆ సౌకర్యాలే ఉంటాయ్!

మృత్యుంజయ స్తోత్రంతో మొదలు

Advertisement

రీసెంట్‌గా వచ్చిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రంలో నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న విక్రాంత్ (Vikranth), ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ గ్లింప్స్ మొత్తం అతనిపైనే కట్ చేశారు. ఇందులో విక్రాంత్‌ని చాలా పిరికివాడిగా చూపించి, ఆయనకు ధైర్యం చెప్పే పాత్రలో అమ్మను పరిచయం చేశారు. ఆమె ఆ మహాశివుని గురించి చెబుతుంటే.. వెనుక సంగీత దర్శకుడు హరి ఎస్ ఆర్ చేసిన డ్యూటీ.. గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
‘‘మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణాగతమ్..
జన్మమృత్యు జరారోగై పీడితం కర్మబంధనైః…’’ అనే మృత్యుంజయ స్తోత్రంతో ఈ గ్లింప్స్ మొదలైంది. పోలీస్ ఆఫీసర్లు, కొయ్యదొరలు చనిపోయినట్లుగా చూపించారు. అందులో విక్రాంత్ కనిపించే తీరు అందరినీ భయపెడుతుంది. అనంతరం విక్రాంత్ ఒక గుహలోకి ప్రవేశిస్తుంటే.. అతని వెనుక సర్పాలు వెంటాడుతుంటాయి. భయపడుతూనే విక్రాంత్ ఆ భయంకరమైన గుహలోని నాగబంధం దగ్గరకు వెళ్లడం చూపించారు. నాగబంధం దగ్గర ఓ వింత ఆకారాన్ని చూపించి భయపడిన విక్రాంత్.. తన తల్లికి ‘భయమేస్తుంది అమ్మా’ అని చెబితే.. ఇక అక్కడి నుంచి ఈ గ్లింప్స్ మాములుగా లేదు.

Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ చుట్టూ ’42 రూల్స్’ సెగ.. ఇది ప్రోటోకాలా? లేక అహంకారమా?

అప్పుడు మొదలవుతుంది ఆయన ఆట

Advertisement

తల్లి వాయిస్‌లో.. ‘ధైర్యమంటే భయపడకపోవడం కాదు నాన్న మార్కండేయ. వెన్నులోంచి గజగజగజ వణుకొచ్చి గుండె ఆగిపోయేంత భయం వేసినా, వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లడమే నాన్న ధైర్యమంటే. నీ శక్తికి మించిన అడ్డంకులు వస్తాయి. నీ ఊహకు అందని ఆపదలు ఎదురవుతాయ్, నీ వల్ల కాదని అనుకుంటావ్, అంతా అయిపోయిందని అనుకుంటావ్. అప్పుడు మొదలవుతుంది ఆయన ఆట’’ అని చెబుతుంటే, స్క్రీన్‌పై ఆసక్తికరమైన సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. అమ్మ ఆ మాట చెప్పిన తర్వాత మహాశివుని రూపాన్ని చూపించిన తీరు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. అందరిని ఒక్కసారిగా తన్మయత్వంలోకి తీసుకెళ్లిపోతాయి. ‘కార్తికేయ 2’ తరహాలో సాగిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి సిస్ట్లా విఎమ్‌కె దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read- Chandrababu – Bandla Ganesh: తన కోసం తిరుమలకు పాదయాత్ర.. బండ్ల గణేశ్‌తో చంద్రబాబు ఏమన్నారంటే?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×