E-Paper
Advertisement

ఒకే హీరోకి కూతురిగా, లవర్‌గా, తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఒకే హీరోకి కూతురిగా, లవర్‌గా, తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Advertisement

Meena’s Rare Record: మాములుగా ఒక హీరో పక్కన హీరోయిన్ గా నటిస్తారు,కాదంటే తల్లిగా నటిస్తారు, లేదంటే కూతురిగా నటిస్తారు.కానీ ఒకే హీరో పక్కన్న తల్లిగా, కూతురిగా,లవర్ గా నటించిన హీరోయిన్ గురించి మీకు తెలుసా..?అసలు ఇండియన్ సినీ హిస్టరీలోనే ఈ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు ?చూసేద్దాం రండి.

సీనియర్ హీరోయిన్ మీనానే

Advertisement

ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించిన సీనియర్ హీరోయిన్ మీనానే ఈ రేర్ ఫీట్ ని దక్కించుకుంది. అవును..మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో కలిసి మీనా ఇలా మూడు విభిన్న,అది కూడా ఎవరికీ సాధ్యం కాని పాత్రలని చేసి హిస్టరీలో తనకంటూ ఒక స్పెషల్ చాప్టర్ ని లిఖించుకుంది.మరింతకీ ఈ వెటరన్ బ్యూటీ మమ్ముట్టితో చేసిన ఈ క్రేజీ జర్నీ ఏంటో, ఆ సినిమాలు ఏవో ఒకసారి చూస్తే …

1993 లో రిలీజైన ‘జాక్ పాట్’లో 

Advertisement

మొదటగా ఈ జర్నీ 1991లో వచ్చిన ‘ఒరు ప్రాసంగిక ముఖ్యం’ అనే సినిమాతో మొదలైంది.అయితే మమ్ముట్టికి మీనా కూతురు వరుస అయ్యే పాత్ర చేసిన సినిమా ‘జాక్ పాట్’.1993 లో రిలీజైన ఈ మూవీలో మీనా,మమ్ముట్టికి కూతురి వరుస అయ్యే నెగెటివ్ షేడ్స్ ఉన్నఛాలెంజింగ్ రోల్‌లో కనిపించి మెప్పించింది.

also read :నన్ను ఒంటరిగా హోటల్ రూమ్‌కు రమ్మన్నారు.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్

అయితే ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా, వయసులో ఉన్న హీరోయిన్‌గా అప్పుడప్పుడే కెరీర్ మొదలెట్టిన మీనా మమ్ముట్టి లాంటి మెగాస్టార్ పక్కన్న కూతురిగా నటించడం ఆమె కెరీర్‌కి పెద్ద ప్లస్ అయింది. ఆ సినిమాలో వాళ్ల మధ్య ఉన్న డ్రామా, ఎమోషన్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి కూడా.అంతవరకు బాగానే ఉంది కాని.

2004 లో వచ్చిన ‘రాక్షసరాజవు’ మూవీలో

కానీ కట్ చేస్తే ..సీన్ రివర్స్ అయింది..మమ్ముట్టికి కూతురిలా నటించిన మీనా ఆ తర్వాత అతనితో ప్రేమాయణం పలికిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. క్రమంగా  హీరోయిన్ గా మారిన మీనా సరిగ్గా పదకొండేళ్ల తర్వాత, అంటే 2004 లో వచ్చిన ‘రాక్షసరాజవు’ మూవీలో మమ్ముట్టికి ప్రియురాలిగా నటించింది.అంటే నిన్నటివరకు కూతురిగా నటించిన అమ్మాయే ఈ రోజు ప్రియురాలిగా కనిపించిందన్న మాట.అయితే తండ్రి ,కూతురిగా ఇద్దరు స్క్రీన్ పై ఎంతటి ఎమోషన్ చూపించారో, లవర్ గానూ మమ్ముట్టి తో అంతే రొమాన్స్ పండించటం విశేషం.ఇక ఆ సమయంలో వీరిద్దరి జోడీ ఫుల్ పాపులర్ అయింది కూడా.

‘పళస్సి రాజా’లో మమ్ముట్టి చిన్నప్పటి పాత్రకి తల్లిగా

అయితే కూతురిగా, లవర్ గా నటించిన మీనా అసలైన ట్విస్ట్ ఇచ్చింది మాత్రం 2010లో. అవును ఆ ఏడు వచ్చిన హిస్టారికల్ ఫిలిమ్ ‘పళస్సి రాజా’లో మమ్ముట్టి విప్లవ వీరుడు పళస్సి రాజా గా కనిపిస్తే ఆయన చిన్నప్పటి పాత్రకి తల్లిగా మీనా నటించి మెప్పించింది.ఒకప్పుడు మమ్ముట్టికి కూతురిగా, ఆ తర్వాత లవర్‌గా కనిపించి మెప్పించిన మీనా అదే హీరోకి తల్లి పాత్రలో చూసేసరికి థియేటర్లలోషాక్ అయ్యారు జనాలు.అలా సినీ ఇండస్ట్రీలో ఒకే నటుడితో ఇలా వేరు వేరు బందాలలో నటించి అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది మీనా.

also read :దళపతి విజయ్ ‘జననాయగన్’ రివ్యూ: ఫ్యాన్స్ ఊహించింది ఒకటి.. జరిగింది వేరొకటి!

Related News

ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?

త్రిషకు అండగా కంగనా.. ఉదయ్ నిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్!

మరో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో రౌడీ హీరో..విస్తరిస్తున్న సినీ సామ్రాజ్యం!

ఢిల్లీ భవన ప్రమాదంపై సోనూసూద్ డిమాండ్!

కైపెక్కించే ఫోజులతో విష్ణుప్రియ కిర్రాక్ లుక్.. ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×