E-Paper
Advertisement

Gurukul Vacancies: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి బ్రేక్.. బ్యాక్ డోర్‌లో అమ్మేస్తున్నారా?

Gurukul Vacancies: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి బ్రేక్.. బ్యాక్ డోర్‌లో అమ్మేస్తున్నారా?
Advertisement

Gurukul Vacancies: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను వెంటనే వెల్లడించాలని సంబంధిత అధికారులను ఆ శాఖ మంత్రి ఆదేశించినప్పటికీ, వాటి అమలులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇప్పటికీ పాఠశాలల వారీగా, జిల్లా వారీగా ఖాళీల జాబితా అందుబాటులోకి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రతి సీటును భర్తీ చేయాలనే లక్ష్యంతో ఖాళీల వివరాలను పారదర్శకంగా ప్రకటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

గురుకులాల్లో ఖాళీలు భర్తీ..

అయితే రీజినల్, జోనల్ స్థాయి అధికారులు ఈ అంశాన్ని తేలికగా తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల నుంచి కూడా సమగ్ర సమాచారం ప్రధాన కార్యాలయానికి చేరడం లేదని తెలుస్తోంది. పేద విద్యార్థులందరికీ విద్యనందించాలనే ఉద్దేశ్యంతో గురుకులాల్లో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే జిల్లా కలెక్టర్లు సైతం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఖాళీల సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన వ్యవస్థ సమర్థంగా పనిచేయకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Also read: నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్నీన్ సిగ్నల్!

ఖాళీలు ఎక్కడ ఉన్నాయి? 

మరోవైపు, ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన హెల్ప్ డెస్క్‌లు ఇప్పటికీ అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. గురుకుల పాఠశాలల స్థాయిలో కూడా హెల్ప్ డెస్క్‌లు లేకపోవడంతో తల్లిదండ్రులు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఖాళీలు ఎక్కడ ఉన్నాయి? ఏ పాఠశాలలో ప్రవేశానికి అవకాశం ఉంది? అనే కనీస సమాచారం కూడా అందక పలువురు జిల్లా కేంద్రాలు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇకపోతే రీజినల్, జోనల్ ఆఫీసర్లు కూడా ఈ అంశాన్ని లైట్ తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లా వారీగా..

Advertisement

ఖాళీల వివరాలు అందుబాటులో లేకపోవడంతో సీటు కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా మంత్రి పేషీని ఆశ్రయిస్తుండటం గమనార్హం. తమ పిల్లలకు గురుకులంలో ప్రవేశం కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా స్థానిక స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలు మంత్రి కార్యాలయానికి చేరుతుండటంతో అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రభుత్వానికి అనవసరంగా చెడ్డపేరు వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెంటనే జిల్లా వారీగా, పాఠశాలల వారీగా ఖాళీ సీట్ల వివరాలను ప్రకటించి, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఆదేశాల అమలుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కూడా వారు కోరుతున్నారు.

Also read: KTR: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ నోటీస్..?

Related News

‘సర్’ ప్రక్రియలో గందరగోళం.. అధికారుల లెక్కలు వేరు.. గ్రౌండ్ రియాలిటీ వేరు!

డేంజర్ జోన్‌లో తెలంగాణ.. పడిపోయిన భూగర్బజలాలు వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!

KTR: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ నోటీస్..?

GHMC: హైదరాబాద్‌కు మరో కొత్త వెలుగులు.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం!

ఢిల్లీ విద్యార్థుల దాడి పై బీఆర్ఎస్ మౌనం.. వెలుగులోకి సంచలనాలు?

కేద్రంలో బీజేపీ పతనం మొదలైది.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక!

తెలంగాణలో కొత్త లిఫ్ట్ చట్టం.. ఇకపై నాణ్యత లేకపోతే కంపెనీలపై కఠిన చర్యలు

Big Stories

Advertisement
×