IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై ( Indian Premier League 2026 Tournament) భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ 2027 టోర్నమెంటుకు సంబంధించిన మ్యాచ్ లను ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ ( Adelaide Oval) వేదికగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జాతీయ మీడియాలు కథనాలు వస్తున్నాయి. మన ఇండియాలో కాకుండా వచ్చే సీజన్ ను ఆస్ట్రేలియా గడ్డపై ( Australia) నిర్వహించి, ఐపీఎల్ కు మరింత క్రేజ్ తీసుకువచ్చేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంటును అడిలైడ్ వేదికగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ టోర్నమెంట్ మొత్తాన్ని అక్కడ నిర్వహిస్తారా ? లేక ఎలిమినేటర్, క్వాలిఫైయర్, ఫైనల్ లాంటి మ్యాచ్ లను నిర్వహిస్తారా ? అనేది క్లారిటీ మాత్రం రాలేదు. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందని అంటున్నారు.
ఆస్ట్రేలియాలోని నలుమూలల ఇండియన్స్ ఉన్నారు. ముఖ్యంగా అడిలైడ్ ఓవల్ ప్రాంతంలో ఇండియన్స్ ఎక్కువ. అక్కడ కూడా ఐపీఎల్ బ్రాండ్ పెంచాలన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి దీనిపై నిజంగానే బిసిసిఐ నిర్ణయం తీసుకుందా ? లేదా ? అనేది త్వరలో క్లారిటీ రానుంది.
గతంలో కూడా విదేశాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. 2009 సమయంలో ఇండియా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎండాకాలమే ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఐపిఎల్ 2009 నిర్వహించాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికల నేపథ్యంలో మొదటి 20 మ్యాచ్లను అబుదాబి, దుబాయి అలాగే షార్జా వేదికల్లో నిర్వహించారు. అటు 2020, 2021 సమయాలలో కరోనా వ్యాపించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా యూఏఈ లో మ్యాచ్లు నిర్వహించారు.
ఇది ఇలా ఉండగా, 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య వార్ కొనసాగింది. అప్పుడు ఐపీఎల్ ( IPL) మధ్యలోనే ఆగిపోయి, 15 రోజుల తర్వాత పున: ప్రారంభమైంది. ఈసారి కూడా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇండియాలోనే ఇండియన్ ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నిర్వహిస్తున్నారు.
Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక..రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్షల ఫైన్
📢IPL WILL PLAY IN AUSTRALIA..!!
Adelaide Oval is planning to host a regular-season IPL match as early as next March 2027. (Tom Morris) pic.twitter.com/fmIv7BgEKK
— Danish (@BhttDNSH100) April 14, 2026