E-Paper
Advertisement

అత్యాధునిక ఫీచర్లతో Xiaomi Mini LED TVs.. ఇలాంటి డిస్‌ప్లే కోసం ఆస్తులైనా అమ్మేసుకోవచ్చు!

అత్యాధునిక ఫీచర్లతో Xiaomi Mini LED TVs.. ఇలాంటి డిస్‌ప్లే కోసం ఆస్తులైనా అమ్మేసుకోవచ్చు!
Advertisement

Xiaomi TV S Mini LED: భారతదేశంలో చాలామంది యూజర్లు కళ్లు మూసుకునే కొనేసే టీవీ బ్రాండ్ షావోమీ. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే ఈ సంస్థ.. ఇప్పుడు మరో సూపర్బ్ టీవీ సిరీస్‌ను తీసుకొచ్చేస్తోంది. ఏప్రిల్ 15న Xiaomi TV S Mini LED పేరుతో కొత్త టీవీలను ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. స్మార్ట్ టీవీ అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ టీవీలను తయారు చేసినట్లు తెలుస్తోంది.

కళ్లు చెదిరే డిస్‌ప్లే క్వాలిటీ..

ఈ టీవీల్లో మెయిన్ హైలైట్ ఏమిటంటే.. దీనిలో వాడిన మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీ. మనం వాడే మామూలు టీవీల కంటే ఇవి చాలా ప్రత్యేకం. అలాగే ఈ సిరీస్ టీవీల్లో వాడే లైట్లు చాలా చిన్నవిగా ఉండటం వల్ల స్క్రీన్ పైన రంగులు, వెలుతురు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. డార్క్ సీన్స్ చూస్తున్నప్పుడు కూడా ప్రతీ డీటెయిల్ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. తద్వారా మనం చూసే సినిమా, క్రికెట్ మ్యాచ్ లో ప్రతీ విజువల్ ఎంతో సహజంగా, మన కళ్ల ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది.

విజువల్స్ నెక్ట్స్ లెవెల్..

Advertisement

షావోమీ ఈ టీవీల్లో Quantum MagiQ అనే కొత్త టెక్నాలజీని వాడుతోంది. పేరుకు తగ్గట్టే ఇది విజువల్స్‌లో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. రంగులను మరింత అందంగా, కాంట్రాస్ట్‌ను మరింత లోతుగా చూపిస్తుంది. దీనివల్ల ఏ కంటెంట్ చూసినా సరే.. మనకు ఒక సినిమా థియేటర్లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది.

Also Read: పదార్థాలు పాడవకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంతలో ఉండాలి? ఆ తప్పులు మాత్రం చేయొద్దు!

హాల్‌కు తగ్గట్టే నచ్చిన సైజులో..

Advertisement

చాలామందికి పెద్ద స్క్రీన్ టీవీలు అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరికి వాళ్ల గదికి సరిపడా కావాలి. అందుకే షావోమీ ఈ సిరీస్‌ను మూడు రకాల సైజుల్లో (55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాలు) తీసుకొస్తోంది. దీంతో మన హాల్ ఎంత పెద్దదైనా సరే.. దానికి తగ్గట్టుగా బెస్ట్ టీవీని ఎంచుకోవచ్చు.

టీవీతో ఇంటినే స్మార్ట్‌గా మార్చేయొచ్చు..

ఈ ఏఐ యుగంలో అన్నీ స్మార్ట్ డివైజ్‌లే కదా. మీ వద్ద ఉన్న షావోమీ ఫోన్లు, టాబ్లెట్లు లేదంటే ఇతర స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్‌ను ఈ టీవీతోనే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో టీవీ చూస్తూనే మీ ఇంటిలోని ఇతర స్మార్ట్ పరికరాలను హాయిగా ఆపరేట్ చేయొచ్చు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా షావోమీ ఈ టీవీలను ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. వీటి ధర ఎంత ఉండబోతోంది? ఎప్పటి నుంచి కొనుక్కోవచ్చు? అనే విషయాలు ఏప్రిల్ 15న లాంచ్ రోజున తెలుస్తాయి.

Also Read: ఫోన్ కెమెరాకు లెన్స్ పెట్టుకోవచ్చు.. ఈ Vivo X300 FE కొత్త టెక్నాలజీ గురించి తెలుసా?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×