E-Paper
Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీ షట్‌డౌన్ దిశగా అడుగులు.. ఆ ఒక్క డిమాండ్ నెరవేరకపోతే థియేటర్లు బంద్?

టాలీవుడ్ ఇండస్ట్రీ షట్‌డౌన్ దిశగా అడుగులు.. ఆ ఒక్క డిమాండ్ నెరవేరకపోతే థియేటర్లు బంద్?
Advertisement

Percentage Controversy : కూల్ గా సాల్వ్ అవుతుందనుకున్న ‘పర్సంటేజ్’ పంచాయితీ ఇపుడు మరింత ముదురుతుంది. ఈ క్రమంలోనే మే 23వ తేదీ శనివారం మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ వేదికగా జరగబోయే సంయుక్త సమావేశంపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య సినీ అభిమానుల్లోనూ ఉత్కంఠ నెక్స్ట్ లెవల్ కి చేరిపోయింది. ఎందుకంటే ఈ మీటింగ్‌లో వచ్చే నిర్ణయాల ఆధారంగానే తెలుగు సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వివాదానికి ఆజ్యం పోసింది ‘పెద్ది’ మూవీ

Advertisement

అసలు ఈ వివాదానికి ఆజ్యం పోసింది చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ డ్రామా ‘పెద్ది’ మూవీ అని చెప్పాలి. ఈ భారీ బడ్జెట్ సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకురావడానికి, అలాగే ప్రొడక్షన్ కాస్ట్‌ను రికవర్ చేయడానికి వీలుగా థియేటర్ల రెంట్లు (అద్దెలు) పెంచుతామంటూ నిర్మాతల మండలి ఒక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ ఎగ్జిబిటర్లు ఏమాత్రం అంగీకరించడం లేదు. కేవలం ఈ ఒక్క పెద్ద సినిమా కోసమో, లేదా తాత్కాలిక ప్రయోజనాల కోసమో రెంట్లు పెంచితే తమకు వచ్చే లాభం ఏమీ లేదని వారు తెగేసి చెప్తున్నారు. తమకు ఇన్నాళ్లుగా అన్యాయం జరుగుతోందని, ఇకపై లాభనష్టాల్లో ఖచ్చితమైన పార్టనర్ షిప్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

also read :డ్రాగన్’ వేట మొదలైంది.. టాలీవుడ్ హిస్టరీలో తారక్ – నీల్ సరికొత్త సంచలనం!

Advertisement

నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జువ్వాడి శేఖర్ రావు

తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జువ్వాడి శేఖర్ రావు నేతృత్వంలో ఎగ్జిబిటర్లు ఇప్పుడు చాలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కేవలం ‘పెద్ది’ సినిమాకే కాకుండా, భవిష్యత్తులో రాబోయే ఏ పెద్ద సినిమాకైనా,చిన్న సినిమాకైనా సరే ఖచ్చితంగా ‘పర్సంటేజ్ సిస్టమ్’ అమలు చేయాలని వారు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో టికెట్ బుకింగ్స్ మరియు కలెక్షన్ల ఆధారంగా ఎలాగైతే రెవెన్యూ షేరింగ్ జరుగుతుందో, అదే మోడల్‌ను సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా వర్తింపజేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఈ విధానాన్ని అధికారికంగా రాతపూర్వకంగా రాసిస్తేనే ‘పెద్ది’ సినిమాను తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని, లేదంటే అసలు స్క్రీన్స్ ఓపెన్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.

కదిలి వస్తున్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు

ఇక ఈ శనివారం జరగబోయే హై-వోల్టేజ్ మీటింగ్‌లో తమ బలాన్ని, యూనిటిని నిరూపించుకోవడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు భారీగా తరలివస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తీసుకురావడానికి ఎగ్జిబిటర్లు ఒక బలమైన వ్యూహాత్మక అప్పీల్‌ను సిద్ధం చేశారు. కరోనా తర్వాత ఓటీటీల హవా పెరిగిపోవడం, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం వల్ల తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, కేవలం పర్సంటేజ్ విధానం ద్వారానే సింగిల్ స్క్రీన్స్ మనుగడ సాధ్యమని వారు గట్టిగా నమ్ముతున్నారు.

also read :అనిరుధ్, కావ్య మారన్ లవ్ ఎఫైర్.. వైరల్ అవుతున్న క్రేజీ డీటెయిల్స్!

శనివారం సాయంత్రానికి తెరపడుతుందో లేదో

ఇక ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం, ఒకవేళ శనివారం నాటి చర్చలు విఫలమై, నిర్మాతలు ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తే గనుక టాలీవుడ్‌లో థియేటర్ల బంద్ (ఫిల్మ్ ఇండస్ట్రీ షట్‌డౌన్) జరిగే ప్రమాదం ఉందని తెలుస్తుంది. అదే గనుక జరిగితే డిస్ట్రిబ్యూషన్ రంగంతో పాటు వేల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఈ ఈగో వార్ ఇలాగే ముదిరితే రాబోయే భారీ చిత్రాల రిలీజ్ డేట్లు కూడా మారిపోతాయనడంలో సందేహం లేదు . చూడాలి జువ్వాడి శేఖర్ రావు మార్గదర్శకత్వంలో ఎగ్జిబిటర్లు వేస్తున్న అడుగులు టాలీవుడ్‌ లో ఎలాంటి పరిణామాలకి దారి తీస్తాయో..ఈ పంచాయితీకి శనివారం సాయంత్రానికి తెరపడుతుందో లేదో !

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×