E-Paper
Advertisement

Tandur Politics: తాండూరు​ చైర్మన్​ ఎవరికి దక్కుతుందో? మాటల తూటాలతో రచ్చకెక్కుతున్న నేతలు!

Tandur Politics: తాండూరు​ చైర్మన్​ ఎవరికి దక్కుతుందో? మాటల తూటాలతో రచ్చకెక్కుతున్న నేతలు!
Advertisement

Tandur Politics:  మున్సిపల్​ ఎన్నికల నోటిఫికేషన్​ నుంచి తాండూర్​ రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ఎమ్మెల్యే మనోహార్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డిలు మున్సిపాలిటీని తమ చేతుల్లోనే ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నామినేషన్ల పర్వం ఊపందుకున్న నుంచి పొలింగ్ ముగిసేంత వరకు తాండూర్​ పట్టణం మాటలు, తూటలతో హీటెక్కింది. వికారాబాద్​ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలుంటే తాండూర్​ పట్టణంలో నడిచిన రాజకీయ మిగిలిన మున్సిపాలిటీల్లో లేదని చెప్పాలి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాటలు తూటలలాగా ఒకరిపై ఒకరు తీవ్ర స్ధాయిలో చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండ ఓటర్లను ఆకర్షించడం, స్ధానికంగా బలమైన కార్యకర్తలను, నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకున్నారు. ఉదయం ఒక పార్టీలో చేరితే… సాయంత్రం మరో పార్టీ కండువుల కప్పుకోడం తాండూర్​ పట్టణంలో రాజకీయం నడించింది. ఎన్నికల పొలింగ్​ ముగిసిన తర్వాత కూడా తమదే మున్సిపాలిటీ పీఠం అంటే తమదేనని ఇద్దరూ నేతలు మీడియకు వివరించడంతో హాట్​ హాట్గా చర్చ సాగుతుంది.

ప్రచారంలో వెనక్కి తగ్గని నేతలు

ఎన్నికల సందర్భంగా జరిగిన వారం రోజుల ప్రచారంలో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీధర్​ బాబుతో పట్టణంలో కార్నర్​ సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యే మనోహార్​ రెడ్డి హడావుడి చేశారు. తానేమి తక్కువ కాదనే పద్దతిలో బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్​ను పిలిపించి రోడ్​ షోలు నిర్వహిచారు. ఇద్దరూ నేతలు హోరాహోరీగా స్ధానింగా ఉండి ప్రచారం చేశారు. ప్రతి డివిజన్​ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని రోహిత్​ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తే jప్రస్తుత రేండేండ్లల్లో చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టి ప్రణాళికలను ఎమ్మెల్యే మనోహార్​ రెడ్డి ఓటర్లకు వివరిస్తూ జోరుగా ఖర్చుతో కూడిన ప్రచారం చేశారు.

Advertisement

Also Read: Mahesh Kumar Goud: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయం : మహేష్ కుమార్ గౌడ్

మాజీ ఎమ్మెల్యే ఆ నాయకులతో ములాఖాత్

ఉమ్మడి రంగారెడ్డిలోని 13 మున్సిపాలిటీల కంటే తాండూర్​ మున్సిపాలిటీలోనే రాజకీయం రసవత్తరంగా కొనసాగినట్లు స్పష్టమైతుంది. అధికారంలోనున్న కాంగ్రెస్​ పార్టీకి కొంత సానుకూల వాతావరణం ఉన్నప్పటికి బీఆర్ఎస్​ అంత సులభంగా వదిలిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఎంతటికైన తెగించైన మున్సిపాలిటీని దక్కించుకోవాలనే యోచనలో బీఆర్ఎస్​ ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికి డమ్మీలను చేసి బీఆర్ఎస్​ కు ఓట్లు వేయాలనే ప్రచారం చేసేలా మాజీ ఎమ్మెల్యే ఆ నాయకులతో ములాఖాత్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీ నేతలకు భీఫాం కావాలంటే బీఆర్ఎస్​ నేతల కనుసన్నంలోనే ఇచ్చారని సోషల్​ మీడియాలో వచ్చిన వీడియోలతో అర్ధమైతుంది.

కాంగ్రెస్​ ఖాతాలోకేనా చైర్మన్​ పీఠం?

Advertisement

తాండూర్​ మున్సిపాలిటీలో 36డివిజన్లు ఉండగా 135 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు 36 డివిజన్లకు 36 మందిని బరిలో ఉంచగా బీజేపీ కేవలం 28 వార్డులకే అభ్యర్ధులను నిలబెట్టింది. అయితే బీఆర్ఎస్​ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్​ను ఢీ కొనేందుకు బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ మద్దతుతో బరిలోనున్న నేతలను బీఆర్ఎస్​ నాయకుడు రోహిత్​ రెడ్డి తమ వైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు స్ధానిక మీడియాతో మాట్లాడుతూ… తాండూర్​ మున్సిపాలిటీ పట్టణాని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక స్ధానాలు సాధించి అధికార పార్టీ చైర్మన్​ పీఠం దక్కించుకుంటుందని స్ధానిక ప్రజలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ మద్దతుతో పాటు ఘాటైన మాటలతో చైర్మన్​ పీఠం దక్కించుకుంటామని చెబుతున్నారు. ఏ పార్టీ ఎన్ని స్ధానాలను కైవసం చేసుకుంటుంది. ఎవరి మద్దతుతో ఏ పార్టీ చైర్మన్​ పీఠం దక్కించుకుంటుందా… ఒంటరిగానే కాంగ్రెస్​ కైవసం చేసుకుంటా మూడు రోజులు వేచిచూడాల్సింది.

Also Read: Fake Silver Coins: మున్సిపల్ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు పంచిన బీజేపి అభ్యర్ధి..?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×