Mythri Producers: ప్రస్తుతం టాలీవుడ్‌లోని అగ్రగామి నిర్మాణ సంస్థలలో ఒకటిగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) దూసుకెళుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లో కూడా వారు సినిమాలు చేస్తున్నారు. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా, అందరితో సినిమాలు చేస్తూ, సక్సెస్‌లు కొడుతున్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని (Naveen Yerneni), యలమంచలి రవి శంకర్ (Yalamanchili Ravi Shankar). ఇలాంటి నిర్మాతలు ఒక హీరోగా సినిమా చేసినందుకు తమ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయిందని చెప్పారంటే.. నిజంగా వారికి ఆ హీరో అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది. ఆ హీరో ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు ‘ఆ వెలితి తీరిపోయింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలీ వేడుకలో వారు (Mythri Producers) ఏం మాట్లాడారంటే..
Also Read- Peddi Movie: పెద్ది సినిమాని అంతమంది రిజెక్ట్ చేశారా?
ముందుగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. మేము ఎన్ని పెద్ద సినిమాలు చేసినా.. సినీ పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి మాకు పవర్ స్టార్‌తో సినిమా చేయాలనేది కల. మా కోరిక ఈ మార్చి 19న నెరవేరుతుంది. డిప్యూటీ సీఎం అయినా, ప్రజాసేవలో బిజీగా ఉండి కూడా.. మాకు ఈ సినిమా చేసి పెట్టిన పవర్ స్టార్‌కు మనస్ఫూరిగా కృతఙ్ఞతలు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేము అడగడానికి ఆలోచిస్తుంటే, మీ సినిమా పూర్తి చేస్తానని చెప్పి, ఆయనే మాకు ధైర్యం ఇచ్చారు. పవర్ స్టార్‌తో సినిమా చేయాలని అనుకున్నప్పటి నుంచి దీనికి దర్శకుడు హరీష్ శంకర్ కావాలని అనుకున్నాం. ‘గబ్బర్ సింగ్’ని మించేలా ఈ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్‌కు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ మార్క్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. మార్చి 19న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండని అన్నారు.
Also Read- Manchu Manoj: కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్‌ని రిపీట్ చేయడానికి, ఈ సినిమా కోసం హరీష్ శంకర్ ఎంతో కష్టపడ్డారు. అభిమానులు మెచ్చేలా ఈ సినిమాని మలిచారు. మాకు ఇలాంటి గుర్తుండిపోయే సినిమాను చేసిన పవర్ స్టార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరితో సినిమా చేశాం.. ఆయనతో సినిమా చేయలేదనే వెలితి మాకు ఉండేది. ‘ఉస్తాద్’తో పరిపూర్ణంగా ఆ వెలితి తీరిపోయింది. మా డ్రీమ్ ఫుల్ ఫిల్ అయింది. సినిమా అవుట్ పుట్ చూసుకున్నాం. రిజల్ట్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రజాసేవలో ఉండి కూడా ఈ సినిమాను ఆయన పూర్తి చేశారు. రాత్రుళ్ళు నిద్రపోకుండా షూటింగ్ చేసిన రోజులెన్నో ఉన్నాయి. ఆయన కష్టం ముందు మా కష్టం చాలా చిన్నది అనిపించింది. మేము ఎంతోమందిని చూసి ఉండొచ్చు, కానీ ఆయన చాలా ప్రత్యేకం. మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను ఇటీవల కొందరికి సాయం చేశాను. ఆయనతో కొన్నిరోజులు ప్రయాణం చేస్తే, నలుగురికి సాయం చేయాలనే ఆలోచన మనంలో ఖచ్చితంగా వస్తుంది. ‘ఉస్తాద్’ ఈ మధ్య కాలంలో నేను చూసిన సూపర్ డూపర్ కమర్షియల్ ఫిల్మ్. ప్రారంభం నుంచి చివరి వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుందని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పుకొచ్చారు.
Also Read- Vijay: పాపం విజయ్, త్రిష.. పోలింగ్ తేదీ, కౌంటింగ్ తేదీలతో కూడా ట్రోలింగ్!