Nagabandham: ‘పెద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా (Abhishek Nama) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 15న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీజర్ అప్డేట్ తర్వాత టీజర్ వచ్చే వరకు ఈ సినిమా నుంచి ఏం కంటెంట్ రాదని అంతా అనుకున్నారు. కానీ, అంతేకంటే ముందు సినిమాలోని మరో కీలక పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ ఇతిహాస కథనంలోని మరో కీలక పాత్రని పరిచయం చేయడమే కాకుండా, ఆ పాత్ర తాలుకా ఫస్ట్ లుక్‌ను కూడా శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Maa Vande: ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’.. తాజా అప్డేట్ ఏంటంటే?
బాలీవుడ్ మూవీ ‘ఫైటర్’లో ఆకట్టుకున్న రిషబ్ సాహ్నీ (Rishabh Sawhney) ‘నాగబంధం’లో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి (Afghan Sultan Abdali) పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుపుతూ, అతని లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను వదిలారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆరాచయం అనేలా ఉంది. 1750లో బ్యాక్ డ్రాప్‌లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను ఈ పాత్ర ద్వారా చూపించబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్‌ని గమనిస్తే.. మంచుతో కప్పబడిన యుద్ధభూమిలో తుఫాన్ వాతావరణం మధ్య, భారీ రక్తంతో మచ్చలపడ్డ గొడ్డలిని చేతబట్టి.. యుద్ధానికి దూసుకెళ్తున్న అబ్దాలీగా రిషబ్ సాహ్నీ ఇందులో కనిపిస్తున్నారు. అతని వెనుక భారీ సైన్యం, గాలికి చీలిపోతున్న ఆకుపచ్చ యుద్ధ జెండాలు, యోధులు, యుద్ధ ఏనుగులు ఒక హై-వోల్టేజ్ వార్ కాన్వాస్‌ను ఈ పోస్టర్ తెలియజేస్తుంది. ఇంకా చుట్టూ మెరుస్తున్న కళ్లతో ఉన్న తోడేళ్ల గుంపు అతని చుట్టూ చేరడం చూస్తుంటే.. రిషబ్ పాత్ర ఇందులో ఎంత క్రూరత్వంగా ఉంటుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
Also Read- Balakrishna: చరణ్ ట్విన్స్ కోసం బాలయ్య స్పెషల్ గిఫ్ట్స్.. మురిసిపోతున్న ఫ్యాన్స్!
ఈ పాత్ర గురించి మేకర్స్ ఏం చెప్పారంటే.. ‘నాగబంధం’లో అబ్దాలీ ఆశ, క్రూరత్వంతో నడిచే వ్యక్తిగా కనిపించనున్నారు. హిమాలయాల్లో దాగి ఉన్న మిథికల్ నాగబంధాన్ని స్వాధీనం చేసుకోవడానికి, బ్రాహ్మణులు, పిల్లలు సహా ఎందరి ప్రాణాలనైనా బలి చేయడానికి వెనుకాడని వ్యక్తిగా ఆయన కనిపిస్తారు. చరిత్రలో అత్యంత నిర్దయ కలిగిన వ్యక్తిగా ఇందులో కనిపిస్తాడని అన్నారు. ఈ పాత్రకు రిషభ్ చేసిన నటన చూస్తే, అబ్దాలీనే తెరపై జీవించినట్టుగా అనిపిస్తుందని, ఈ క్లిష్టమైన పాత్రలో అతడు అద్భుతంగా నటించారని అన్నారు దర్శకుడు అభిషేక్ నామా. ఇలాంటి ఓ సవాలుతో కూడిన పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నానని.. ఆ పాత్ర, అతని లక్ష్యాలను కథకు న్యాయం చేస్తూ చూపించేందుకు ప్రయత్నించానని రిషభ్ అన్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుందని తెలుస్తోంది.
Also Read- Vijay Sethupathi: మాట మీద నిలబడని విజయ్ సేతుపతి.. ఆ సినిమాలో పాత్ర కోసమే ఇదంతా..!