E-Paper
Advertisement

జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్ వివాదం.. ఇండైరెక్ట్‌గా బుచ్చిబాబుకు సపోర్ట్ చేసిన లేడీ డైరెక్టర్!

జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్ వివాదం.. ఇండైరెక్ట్‌గా బుచ్చిబాబుకు సపోర్ట్ చేసిన లేడీ డైరెక్టర్!
Advertisement

Nandini Reddy’s Bold Comments: ప్రముఖ కథానాయిక సుమంత హీరోయిన్ గా నటించి, నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్ బ్యానర్ పై సమంతతో పాటు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. నందినీరెడ్డి ఈ మూవీని తెరకెక్కించారు.. ఇక సినిమా ఈ నెల 19న విడుదల కాబోతున్నసందర్భంగా ప్రమోషన్లలో వేగం పెంచింది మూవీ టీమ్.

ఈ క్రమంలోనే జరిగిన ఇక ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చింది డైరెక్టర్ నందిని రెడ్డి. ముఖ్యంగా సినిమా చేయాలని ఎవరూ గన్ పెట్టి బలవంతం చేయరని, కథ ఏంటి ఎలా ఉంటుంది అని నటీనటులకి ముందుగానే చెబుతారని, అయితే అది చేయాలా వద్దా అనేది పూర్తిగా వారి నిర్ణయమేనని చెప్పుకొచ్చారు.

Advertisement

 రాణించాలంటే అన్నింటికీ సిద్దపడి ఉండాలి 

అయితే డబ్బు ఎక్కువఫా ఆఫర్ చేసినా కూడా వద్దు అని చెప్పే స్థోమత ఉందా లేదా అన్నది ఇక్కడ కీ రోల్ పోషిస్తుందని, అంతే తప్ప నువ్ తప్పని సరిగా ఈ సినిమా చేయాలని ఎవరూ బలవంతం చేయరని తేల్చి చెప్పారు.ఇండస్ట్రీలో రాణించాలంటే అన్నింటికీ సిద్దపడి ఉండాలని, అలా కాకుండా విమర్శలు తీసుకొను,కేవలం ప్రశంసలు మాతమే తీసుకుంటానంటే ఇక్కడ కుదరదని కుండబద్దలు కొట్టారు.

Advertisement

also read :రూ.కోటి తీసుకుని హ్యాండ్ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్? డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

జబర్ధస్ట్ సినిమా చేసినప్పుడు తనని అంతకన్నా ఎక్కువ బండబూతులు తిట్టారని, వాటిని కూడా స్వాగతించానని ,అలా కాకుండా నేను అలా మొదలైంది అనే సినిమా తీశాను కాబట్టి కాస్త ఎక్స్క్యూజ్ చేయండి అని అడగలేదని మనసులో మాటని బయటపెట్టారు.

ఇన్ డైరెక్ట్ గా  బుచ్చి బాబుకి మద్దతుగా కామెంట్స్ 

అయితే పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత పై సినిమా సర్కిల్స్ లో ఇప్పటికే హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇక ఇప్పటికే జాన్వీకి సపోర్ట్ గా జయ బచ్చన్, ఆషిక రంగనాథ్, కరీనా కపూర్ వంటి వారు తమ వాయిస్ వినిపించగా, వారికి భిన్నంగా నందిని రెడ్డి అన్నీ తెలిసే అడుగు ముందుకు వేస్తారు అన్న విధంగా మాట్లాడం ఇపుడు ఇక్కడ గమనార్హం.

ఇక సినిమా విషయానికి వస్తే రాజ్ నిడిమోరు, వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్‌తో కలిసి స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సంతోష్‌ నారాయణన్ సంగీతం అందించారు.ఇక ఈ సినిమాలో శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి, దిగంత్‌, గుల్షన్‌ దేవయ్య, గౌతమి, ఆనంద్‌, లక్ష్మీ, మంజూష తదితరులు కీలక పాత్రలు పోషించారు.చూడాలి మరి ఇన్ డైరెక్ట్ గా బుచ్చి బాబుకి మద్దతుగా కామెంట్స్ చేసుకొచ్చిన నందిని రెడ్డి కామెంట్స్ పై ఎవరెలా రియాక్ట్ అవుతారో !

also read :పెద్ది టికెట్ రేట్లపై హైకోర్టు సీరియస్.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కోర్టు!

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×