E-Paper
Advertisement

అమ్మాయిల ఇన్నర్ పార్ట్స్ తో కళాఖండాలు… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న సైకో థ్రిల్లర్

అమ్మాయిల ఇన్నర్ పార్ట్స్ తో కళాఖండాలు… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న సైకో థ్రిల్లర్
Advertisement

True Crime Thriller : సీరియల్ కిల్లర్ల గురించి మనం చాలా కథలు విన్నాం. కానీ నిజ జీవితంలో జరిగిన కొన్ని నేరాలు సినిమాల్లో చూపించిన దానికంటే భయంకరంగా ఉంటాయి. ఒక వ్యక్తి మనుషులను చంపడంతో పాటు.. వారి శరీర భాగాలతో విచిత్రమైన వస్తువులు తయారు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? శవాలను ఇంట్లో దాచిపెట్టుకోవడమే కాకుండా వాటిపై ప్రయోగాలు చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మాన్స్టర్ ది ఎడ్ గీన్ స్టోరీ’ (monster the Ed gein story series).

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ అమెరికా చరిత్రలో అత్యంత కిరాతక నేరస్థుల్లో ఒకడిగా పేరొందిన ఎడ్ గీన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందింది. సాధారణంగా కనిపించే ఒక వ్యక్తి ఎలా భయంకరమైన మానసిక స్థితికి చేరుకున్నాడు? అతని నేరాలు ఎందుకు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయనే విషయాలను ఈ సిరీస్‌లో చూపిస్తారు.

ఎడ్‌ గీన్‌ కథేంటి?

Advertisement

కథ విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో ప్రారంభమవుతుంది. బయటకు చూస్తే ఎడ్ గీన్ చాలా సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. పొరుగువారితో పెద్దగా కలవడు. తన ప్రపంచంలో తానే జీవిస్తుంటాడు. కానీ అతని ఇంటి గోడల వెనుక దాగి ఉన్న నిజం మాత్రం ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. పోలీసులు ఒక కేసు దర్యాప్తు చేస్తూ అతని ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత బయటపడిన విషయాలు అమెరికాను వణికించాయి. ఇంట్లో కనిపించిన వస్తువులు, శరీర అవశేషాలు చూసి అధికారులు కూడా షాక్‌కు గురవుతారు. ఆ తర్వాత బయటపడిన నిజాలు ఈ కేసును ప్రపంచంలోనే అత్యంత క్రూర నేర గాథల్లో ఒకటిగా మార్చాయి.

క్రైమ్‌ + సైకాలజీ కలగలిసిన స్టోరీ:

ఈ సిరీస్‌లో కేవలం హత్యల గురించే కాకుండా ఒక వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా రూపుదిద్దుకుంది? చిన్ననాటి అనుభవాలు అతనిపై ఎలా ప్రభావం చూపించాయి? ఒంటరితనం, భయాలు లాంటి ఆలోచనలు కలిసి ఒక మనిషిని ఎంత ప్రమాదకరంగా మార్చగలవో లోతుగా విశ్లేషిస్తుంది. సిరీస్ చూస్తున్న వారిలో టెన్షన్ ఉంటుంది. అంతేకాదు సిరీస్‌ చూస్తున్నంత సేపు భయం ప్రేక్షకులను వెంటాడుతుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఇన్‌వెస్టిగేషన్‌ అంశాలను కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే నిజ జీవిత నేర గాథలు, సీరియల్ కిల్లర్ కథలు, డార్క్ సైకాలజికల్ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి ఇది ఒక ఇంటెన్స్ వాచ్‌గా చెప్పవచ్చు. అయితే ఇది చూసిన తర్వాత చాలా రోజుల వరకు ఆ కథ, ఆ పాత్ర, ఆ భయంకరమైన నిజాలు మనసును వెంటాడే అవకాశం ఉంది.

Advertisement

Read Also : నిబ్బా నిబ్బి లవ్ స్టోరీకి ఇంత క్రేజా… మోస్ట్ ఇన్‌స్టా ట్రెండింగ్ మలయాళం మూవీ

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×