E-Paper
Advertisement

ACB Raids: లంచం కోసం యూపీఐ బినామీ దందా.. ఏసీబీకి చిక్కిన కరీంనగర్ లేడీ ఆఫీసర్..?

ACB Raids: లంచం కోసం యూపీఐ బినామీ దందా.. ఏసీబీకి చిక్కిన కరీంనగర్ లేడీ ఆఫీసర్..?
Advertisement

ACB Raids: స్వేచ్చ బ్యూరో: కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్ కోసం బినామీ ఖాతాల ద్వారా లంచాలు వసూలు చేస్తున్న కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ దానుక రాధిక బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఐసీడీఎస్ పరిధిలో కోడిగుడ్లు, పప్పుధాన్యాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ల బిల్లులను త్వరగా పూర్తి చేయడానికి రాధిక లంచాలు డిమాండ్ చేశారు.

రూ. 2,37,500 వసూలు..

ఇందుకోసం కార్యాలయంలోని అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, తన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను బినామీలుగా వాడుకుని, యూపీఐ (UPI) ద్వారా లంచం డబ్బులు బదిలీ చేయించుకున్నారు. జూన్-2022 నుండి ఏప్రిల్-2024 మధ్య కాలంలో ఆమె ఈ విధంగా రూ. 2,37,500 వసూలు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అక్రమ లావాదేవీలకు సహకరించాలని అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వేధించినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

Also read: సుపారీ గ్యాంగ్‌తో భార్య హత్య.. ఎట్టకేలకు భర్త అరెస్టు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

టోల్ ఫ్రీ..

నిందితురాలిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 (టోల్ ఫ్రీ) లేదా వాట్సాప్ నెంబర్ 9440446106 లో సంప్రదించాలని ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచబడతాయని అధికారులు తెలిపారు.

Advertisement

Also read: Vizag Tragedy: ఏపీని వణికిస్తున్న స్టీల్‌ప్లాంట్ వివాదం.. వైఎస్ జగన్ ఓట్ల రాజకీయంపై టీడీపీ ఫైర్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×