E-Paper
Advertisement

రూ.కోటి తీసుకుని హ్యాండ్ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్? డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

రూ.కోటి తీసుకుని హ్యాండ్ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్? డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Varalaxmi Controversy: ప్రమోషన్స్ ..ఇవే సినిమాకి ఆక్సిజన్ .అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ ప్రమోషన్స్ కి నటించిన నటీనటులు రాకపోతే అది సినిమాకి ఎంత పెద్ద నష్టం కలిగిస్తుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ చిత్రాలకు నటీనటుల పబ్లిసిటీ మరింత బూస్టప్ ఇస్తుంది. కానీ, ఇదే విషయంలో సీనియర్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రవర్తనపై ఓ టాలీవుడ్ దర్శకుడు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఫిలిమ్ సర్కిల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

విషయంలోకి వెళ్తే ..హారర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా  హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి హీరోయిన్ వరలక్ష్మిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఆమె, సినిమా పబ్లిసిటీకి అస్సలు సహకరించడం లేదని ఓపెన్ గానే ఆరోపించారు.

ఒక్కో ప్రెస్ మీట్ కేవలం 40 నిమిషాలు మాత్రమే

Advertisement

షూటింగ్ సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారని, కానీ ప్రమోషన్ల విషయానికి వస్తే మాత్రం అస్సలు స్పందించడం లేదని దర్శకుడు సంజీవ్ మండిపడ్డారు. అదే సమయంలో రెమ్యునరేషన్ విషయానికి వస్తే మాత్రం ఆమె మేనేజర్ కరెక్ట్ టైమ్‌కి ఫోన్ చేసి నిర్మాతల నుంచి డబ్బులు వసూలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

also read :NBK111: ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా.. బాలయ్య రౌద్రరూపం.. సోషల్ మీడియా షేక్!

Advertisement

ఈ సినిమా కోసం ఆమెకు, ఆమె డైలీ స్టాఫ్‌కి మరో యాభై వేల రూపాయల వరకు కలుపుకుని మొత్తం దాదాపు కోటి రూపాయల మేర చెల్లించామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్‌లో భాగంగా 5 ప్రెస్ మీట్స్‌కి వస్తానని, ఒక్కో ప్రెస్ మీట్ కేవలం 40 నిమిషాలు మాత్రమే కేటాయిస్తానని అగ్రిమెంట్‌లో సైన్ కూడా చేశారని, కానీ ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేయమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారని డైరెక్టర్ కుండ బద్దలు కొట్టారు.

సపోర్ట్ ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్

ఈ సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమలోని మరికొంత మంది ప్రముఖులను ఉదాహరణగా చూపించారు. ‘పెద్ది’ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం అగ్రెసివ్‌గా పబ్లిసిటీలో దూసుకుపోతున్నారని గుర్తు చేశారు. అలాగే 94 ఏళ్ల వయసులో కూడా దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రెస్ మీట్లకు స్వయంగా వస్తున్నారని చెప్పారు. అంతటి సీనియర్లే సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కష్టపడుతుంటే, వరలక్ష్మి లాంటి స్టార్ నటి తమ లాంటి చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని సంజీవ్ ప్రశ్నించారు.

శరత్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతుందో !

ఇదిలా ఉంటె గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతారపై కూడా ఇలాంటి విమర్శలు వచ్చిన సంగతి తెల్సిందే. అయితే నయన్ సినిమా ప్రమోషన్లకు రానని ముందే తన అగ్రిమెంట్‌లో స్పష్టంగా రాసుకుంటుంది. మరి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అలాగే కండిషన్లు పెట్టిందా, లేక షూటింగ్ అయిపోయాక మేకర్స్‌కి హ్యాండ్ ఇచ్చిందా అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద డిబేట్ కి దారితీసింది. ‘క్రాక్’, ‘నాంది’, ‘వీరసింహారెడ్డి’, ‘హనుమాన్’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి, తాజాగా ‘శబరి’సరస్వతి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంతోనూ అలరించిన సంగతి తెల్సిందే. చూడాలి మరి తనపై వస్తున్న ఈ కాంట్రవర్సీపై వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతుందో !

also read :కొత్త ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా..?

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×