Peddi Ticket Price Controversy:పెద్ది…చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే మూడొందల కోట్లకి పైగా వసూల్లని కొల్లగొట్టిందని అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ అందాల ఆరబోతపై నెట్టింట్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.ఇలా థియేటర్ లో ఒకవైపు కాసులు కొల్లగొడుతూనే మరో వైపు కాంట్రవర్సీలకి కేరాఫ్ గా నిలుస్తున్నాడు మన పెద్ది.ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది.
సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్ చేస్తూ ఆమె నేతృత్వంలోని హోంశాఖ జూన్ 2వ తేదీన ఒక ప్రత్యేక మెమో జారీ చేసింది. ఆ మెమో ప్రకారం ‘పెద్ది’ సినిమా విడుదలైన రోజు నుంచి వరుసగా పది రోజుల పాటు టికెట్ రేట్లు భారీగా పెంచుకోవచ్చని, అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 వరకు రేట్లు పెంచుకునేందుకు ఛాన్స్ దొరికింది.
దీంతో సాధారణంగా ఉండే రేట్లు కాస్తా ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. కొన్ని ఏరియాల్లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధర ఏకంగా రూ. 275కు చేరగా, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ. 445 మార్కును దాటేసింది. ఒక సామాన్య కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడంతో ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది కూడా.
also read :కొత్త ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా..?
అయితే, గతంలో సినిమా టికెట్ల నియంత్రణపై హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన గైడ్‌లైన్స్‌ను పక్కనబెట్టి ప్రభుత్వం ఈ మెమో ఎలా ఇస్తుందంటూ కొందరు కోర్టు మెట్లెక్కారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు జూన్ 10వ తేదీన జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో గతంలో రూపొందించిన ‘GO 121’ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ, కోర్టు ఆదేశాలు లెక్క చేయనందుకు శిఖా గోయల్‌పై ధిక్కరణ పిటిషన్‌ను స్వీకరించింది. కోర్టు ఆర్డర్స్ అమల్లో ఉండగా ఇలాంటి ప్రత్యేక మెమోలు జారీ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.
నిజానికి తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి టికెట్ రేట్ల వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఎస్‌ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ‘RRR’, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, అలాగే ఆమధ్య బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పుష్ప 2’, ’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైనప్పుడు కూడా ఇవే సీన్లు రిపీట్ అయ్యాయి. వందల కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలు తమ పెట్టుబడులను మొదటి వారంలోనే సేఫ్ జోన్‌కు తెచ్చుకోవడానికి ఇలాంటి ప్రత్యేక అనుమతులు కోరడం సహజమే అయినా, అది సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెడుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చుట్టూ నడుస్తున్న ఈ లీగల్ ఇష్యూ కేవలం ఈ ఒక్క సినిమాకే పరిమితం కాకుండా, టాలీవుడ్ భవిష్యత్తును డిసైడ్ చేసేలా కనిపిస్తోంది. జూన్ 15న హైకోర్టు ఇచ్చే తుది తీర్పు రాబోయే మిగతా పాన్ ఇండియా సినిమాల బిజినెస్ స్ట్రాటజీలను మార్చే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వ మెమోను పూర్తిగా రద్దు చేస్తే, భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలకు స్పెషల్ రేట్లు, ఐదో షో పర్మిషన్లు దొరకడం గగనమే అవుతుందని లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండితులు.చూడాలి మరి జూన్ 15న కోర్టులో సర్కార్ ఎలాంటి వివరణ ఇస్తారో
also read :రూ.కోటి తీసుకుని హ్యాండ్ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్? డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు