E-Paper
Advertisement

నార్నె నితిన్ ‘రిస్క్’ గేమ్.. ఫ్లాప్ డైరెక్టర్‌తో జూదం? ఆ బ్యానర్ కొంపముంచుతారా!

నార్నె నితిన్ ‘రిస్క్’ గేమ్.. ఫ్లాప్ డైరెక్టర్‌తో జూదం? ఆ బ్యానర్ కొంపముంచుతారా!
Advertisement

Narne Nithin: ఇండస్ట్రీలో కొన్ని కాంబోలో సెట్ అయితే అంచనాలు పెరగడం కామన్, కాని మరికొన్ని కాంబోలు సెట్ అవుతుంటే అదే రేంజ్‌లో నెగటివ్ టాక్ రావడం మరీ కామన్. ఇపుడు లేటెస్ట్‌గా యంగ్ హీరో నార్నే నితిన్ హీరోగా సెట్ అవుతున్న కాంబినేషన్‌పై కూడా అలానే నెగటివ్ టాక్ రావడం గమనార్హం. మ్యాడ్‌తో సక్సెస్ చూసి ఆయ్ తో  ప్రామిసింగ్ హీరోగా స్టాంప్ వేసుకున్న ఈ కుర్ర హీరో నెక్స్ట్ లీగ్‌పై టార్గెట్ చేయాల్సిన ఈ టైమ్‌లో ఓ ప్లాప్ డైరెక్టర్‌తో జత కట్టడం హాట్ టాపిక్ అయిపోయింది

జూనియర్ సినిమా దర్శకుడే ఈ రాధా కృష్ణ రెడ్డి

Advertisement

విషయంలోకి వెళ్తే నార్నే నితిన్ ఇపుడు రాధాకృష్ణ రెడ్డి అనే డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడట. ఇంతకీ ఈ రాధాకృష్ణ రెడ్డి ఎవరనుకుంటున్నారా… గతేడాది సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మాతగా గాలి కిరీటి, శ్రీలీల జంటగా వచ్చిన ‘జూనియర్’ సినిమా దర్శకుడే ఈ రాధాకృష్ణ రెడ్డి. సాలిడ్‌గా లాంచ్ అవుదామనుకున్న గాలి కిరీటి ఆశల్ని తుంచేస్తూ ‘జూనియర్’ సినిమాతో ఈ డైరెక్టర్ ఆడియన్స్‌ని ఎలా టార్చర్ పెట్టాడో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. అలాంటిది ఇపుడు ఇదే డైరెక్టర్ ఏరికోరి కావాలంటూ నార్నే నితిన్ జత కట్టడం చూస్తుంటే నిలబడే ఈ సమయంలో రిస్క్ చేస్తున్నాడని ట్రేడ్ పండిట్స్ హెచ్చరిస్తున్నారు.

also read:చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… ఐటెం సాంగ్ కోసం ఆ బ్యూటీని దింపుతున్న బుచ్చిబాబు?

Advertisement

తారక్ బావమరిది అయినందుకే  నార్నె నితిన్ తో సినిమా?

అంతే కాదండోయ్… ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుందన్న వార్త ఇంకా షాకింగ్‌గా ఉంది. కేవలం తారక్ బావమరిది అయినందుకే నార్నే నితిన్‌తో సినిమా నిర్మిస్తున్నారా లేక నిజంగానే కంటెంట్ ఉండి చేస్తున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్. టెక్నికల్‌గా ఎంత సాలిడ్‌గా ఉన్నా కంటెంట్‌లో దమ్ము లేకపోతే KVN కూడా కాపాడలేదన్నది నిజం. ఇక సినిమా మొదలు కాకముందే సాలిడ్ OTT డీల్ కొట్టేసేందుకే సినిమాపై హైప్ పెంచేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

తలలు పట్టుకుంటున్న తారక్ ఫ్యాన్స్

అయితే తోటి సంగీత్ శోభన్ లాంటి కుర్ర హీరోలు నెక్స్ట్ లీగ్ వెళ్లేందుకు ఎక్స్పరిమెంట్స్ చేస్తూ దూసుకెళ్తుంటే మా నార్నే నితిన్ మాత్రం ఇలా ప్లాప్ డైరెక్టర్‌తో జత కట్టడం ఏంటో అంటూ తలలు పట్టుకుంటున్నారట తారక్ ఫ్యాన్స్. మరి గాలి కిరీటి‌తో కిచిడీ స్టోరీని తెరకెక్కించిన రాధాకృష్ణ రెడ్డి నార్నే నితిన్‌తో ఎలాంటి జానర్‌లో సినిమాని తీస్తాడో చూడాలి. ఏది ఏమైనా నార్నే నితిన్ బోల్తా కొడితే వెనకాల తారక్ ఉన్నాడన్నది నిజం. కానీ ఇలాగే వరుసగా డిజాస్టర్ డైరెక్టర్లను నమ్ముకుని సినిమాలు చేసుకుంటూ పోతే యంగ్ టైగర్ కూడా కాపాడలేడన్నది వాస్తవం. చూడాలి మరి మొదట్లోనే నెగెటివ్ బజ్ మోస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో!

also read:‘ఆంటీ’అంటే రూ.1.5 లక్షల ఫైన్..లండన్ కోర్టు తీర్పుపై అనసూయ రియాక్షన్ వైరల్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×