E-Paper
Advertisement

‘ఆంటీ’అంటే రూ.1.5 లక్షల ఫైన్..లండన్ కోర్టు తీర్పుపై అనసూయ రియాక్షన్ వైరల్

‘ఆంటీ’అంటే రూ.1.5 లక్షల ఫైన్..లండన్ కోర్టు తీర్పుపై అనసూయ రియాక్షన్ వైరల్
Advertisement

Anasuya Post:అనసూయ భరద్వాజ్…సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఎంత యాక్టివ్ గా ఉంటుందో, వాటి కింద అసభ్యంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడితే అంతే వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో నటుడు Shivaji ఇష్యూలో ఈ బ్యూటీ చుట్టూ జరిగిన రచ్చ అంత ఈజీగా మర్చిపోలేం కూడా. ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ అమ్మడు చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.

ఒక వ్యక్తికి ఏకంగా రూ. 1.5 లక్షల ఫైన్

Advertisement

మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే.. యూకేలో జరిగిన కోర్ట్ ఇచ్చిన ఓ వింత తీర్పును సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసింది. మాములుగా మనం కాస్త ఏజ్ లో పెద్ద వాళ్ళని ఆంటీ అనడం చాలా కామన్. కానీ లండన్‌లోని ఓ కోర్టు ఇలా పిలిస్తే ఫైన్ కట్టాలంటూ తీర్పు చెప్పేసింది. అవును…ఒక లేడీని ‘ఆంటీ’ అని పిలిచిన కారణంగా ఒక వ్యక్తికి ఏకంగా రూ.1.5 లక్షల ఫైన్ వేసి పెద్ద షాకే ఇచ్చింది. పైగా మహిళను అలా పిలవడం ఆమె గౌరవానికి భంగం కలిగించడమేనని కోర్టు తేల్చి చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇప్పుడు ఇదే తీర్పుకి సంబంధించిన క్లిప్పింగ్‌ను అనసూయ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ ‘హుమ్’ అంటూ ఒక చిన్న కామెంట్ పెట్టడంతో నెట్టింట డిస్కషన్స్ హాట్ హాట్‌గా మారాయి.

also read:చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… ఐటెం సాంగ్ కోసం ఆ బ్యూటీని దింపుతున్న బుచ్చిబాబు?

Advertisement

ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్…

ఇలానే గతంలో అనసూయని ‘ఆంటీ…ఆంటీ’ అంటూ కొందరు నెటిజన్లు డబుల్ మీనింగ్‌తో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో అనసూయ వారికి వ్యతిరేకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి వారిపై ఫైట్ చేసింది కూడా. ఇక ఇప్పుడు లండన్ కోర్టు ఇచ్చిన తీర్పును అనసూయ పోస్ట్ చేయడం చూస్తే, ‘ఆంటీ’ అని డబుల్ మీనింగ్‌తో పిలిచే ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ సామాన్లు అంటూ…

అయితే అనసూయ కేవలం తనపైనే కామెంట్స్ చేసేవారిపైనే కాకుండా ఆడవాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలోనూ అనేక సార్లు గొంతెత్తింది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ ఆడవాళ్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్‌ను ఖండిస్తూ, “ఆడది తనకు నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు ఉంటుంది” అంటూ అనసూయ ఓపెన్‌గా కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయే టార్గెట్ కావడం కూడా పెద్ద చర్చకు దారి తీసింది.

సగం మంది కోట్లల్లో ఫైన్లు కట్టుకుంటూ ఉండాలేమో

ఇక ప్రస్తుతం లండన్ జడ్జ్మెంట్‌ను కోట్ చేస్తూ అనసూయ పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు “ట్రోలర్స్‌కు అనసూయ ఇస్తున్న వార్నింగ్ మామూలుగా లేదుగా” అంటూ కామెంట్ చేస్తుంటే, మరికొందరు “మన ఇండియాలో కూడా ‘ఆంటీ’ అంటేనే ఇలా కేసు వేసి ఫైన్ వేస్తే జనాభాలో సగం మంది కోట్లల్లో ఫైన్లు కట్టుకోవాల్సి వస్తుందేమో” అంటూ మీమ్స్ వేస్తున్నారు.చూడాలి మరి… ముందు ముందు మన దేశంలో కూడా ఇలాంటి తీర్పులు వస్తాయేమో!

also read:డేట్ మర్చిపోయారా…లేక మైండ్ బ్లాక్ అయ్యిందా?మెగా డాటర్ పై నెటిజన్ల ఫైర్ !

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×