E-Paper
Advertisement

13 ఏళ్లుగా ఒకే గదిలో… ఒక్కో నిమిషం ఊపిరి ఆగిపోయేలా చేసే మిస్టరీ

13 ఏళ్లుగా ఒకే గదిలో… ఒక్కో నిమిషం ఊపిరి ఆగిపోయేలా చేసే మిస్టరీ
Advertisement

Thriller Series OTT : ఓటీటీలో ఇప్పుడు ఎక్కువగా థ్రిల్లర్ సిరీస్ లే ట్రెండ్ అవుతున్నాయి. వీటిని ప్రేక్షకులు కూడా వివపరీతంగా చూస్తున్నారు. మేకర్స్ కూడా ప్రతి ఎపిసోడ్ ను చాలా ఉత్కంఠంగా రూపొందిస్తున్నారు. ఇక ఒక్క ఎపిసోడ్ తో మొదలయ్యే సిరీస్ ను చివరివరకు చూసేలా క్లైమాక్స్ లో అసలు ట్విస్ట్ ను రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. దీనికి ఐయండిబిలో 7.3 రేటింగ్ కూడా ఉంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఏమాత్రం మిస్ చేయకూడని సిరీస్ ఇది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2023లో వచ్చిన ఈ జర్మన్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘డియర్ చైల్డ్’ (Dear Child). ఈ సిరీస్ జర్మన్ రచయిత్రి రోమీ హాస్‌మాన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందింది. ఇది విడుదలైన అతి తక్కువ కాలంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ తో నడిచిన నాన్-ఇంగ్లీష్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఇది 2024లో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డును కూడా కైవసం చేసుకుంది. కేవలం 6 ఎపిసోడ్లతో ఈ సిరీస్‌లో స్క్రీన్ ప్లే, సంగీతం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, జాస్మిన్ పాత్రలో కిమ్ రీడ్లే, హన్నా అనే చిన్నారి పాత్రలో నైలా షుబర్థ్ అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ తో కూడా ఇది అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే

Advertisement

జర్మనీలోని ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న గదిలో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు బందీలుగా ఉంటారు. వాళ్ళను బంధించిన వ్యక్తిని పిల్లలు నాన్న అని పిలుస్తారు. అతను కఠినమైన నియమాలతో వాళ్ళను పెంచుతుంటాడు. భోజనం, చదువు, నిద్ర అన్నీ కరెక్ట్ సమయానికే జరగాలి. ఒకరోజు ఆ గదిలో ఉన్న మహిళ ప్రాణాలకు తెగించి ఆ నరకం నుండి బయటపడుతుంది. తప్పించుకునే క్రమంలో ఆమెకు ఒక కారు ప్రమాదం జరుగుతుంది. ఆసుపత్రిలో చేరిన ఆ మహిళ తన పేరు లెనా అని చెబుతుంది. దీంతో 13 ఏళ్ల క్రితం జరిగిన ఒక మిస్సింగ్ కేసు మళ్ళీ వెలుగులోకి వస్తుంది. సరిగ్గా 13 ఏళ్ల క్రితం బెక్ అనే యువతి కూడా అదృశ్యమై ఉంటుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఆమె తండ్రి మథియాస్ బెక్ ను ఆసుపత్రికి పిలిపిస్తారు. అతను వచ్చి చూస్తే, అక్కడ ఉన్నది తన కూతురు కాదని గుర్తిస్తాడు. కానీ ఆమెతో ఉన్న 12 ఏళ్ల పాప హన్నా మాత్రం అచ్చు తన కూతురు లెనా లాగే ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోతారు.

విచారణలో ఆసుపత్రిలో ఉన్న మహిళ అసలు పేరు జాస్మిన్ గ్రాస్ అని, ఆమెను ఆ సైకో కొద్ది నెలల క్రితమే కిడ్నాప్ చేసి, లెనా అనే పేరుతో పిలుస్తున్నాడని తేలుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. 13 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన అసలైన లెనా, ఆ సైకో వల్ల ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. మూడో బిడ్డకు జన్మనిచ్చే సమయంలో సరైన చికిత్స అందక ఆమె చనిపోయింది. ఆ సైకో ఇప్పుడు ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి ఆమె పోలికలతో ఉన్న జాస్మిన్ ను కిడ్నాప్ చేస్తాడు. చివరికి ఆ సైకో ఎవరు ? లెనాను ఎందుకు కిడ్నాప్ చేశాడు ? జాస్మిన్ అక్కడి నుంచి ఎలా తప్పించుకుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మనసున్న మనుషుల కోసం తీసిన గొప్ప సినిమా… ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×