E-Paper
Advertisement

సంక్రాంతి రేస్ నుండి బాలయ్య అవుట్? NBK 111 రిలీజ్ వాయిదా వెనుక అసలు నిజం!

సంక్రాంతి రేస్ నుండి బాలయ్య అవుట్? NBK 111 రిలీజ్ వాయిదా వెనుక అసలు నిజం!
Advertisement

NBK Injury:నందమూరి బాలయ్య అంటేనే బాక్సాఫీస్ వద్ద పూనకాల మొదలైపోతాయి..ఏజ్ జస్ట్ ఎ నెంబర్ అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్లని షేక్ చేయడం ఒక బాలయ్యకే సొంతం.అలాంటి బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో NBK 111సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సంగతి తెలిసిందే. ఇక వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాలోని ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కాకినాడ పోర్ట్ లో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్.ఇక యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న బాలయ్య ఎలాంటి డూప్ లేకుండా ఫైట్ సీన్లో పాల్గొని గాయాలపాలై హాస్పిటల్ లో పడ్డాడు అన్న వార్త మీడియాలో తెగ హైలైట్ అయింది.అయితే నిజానికి అది యాక్షన్ సీక్వెన్స్ లో జరిగిన గాయం కాదట.

Advertisement

Also read :నాని చేతులు దాటిపోతున్న ‘ది ప్యారడైజ్’? అసలు లోపల ఏం జరుగుతోంది!

ఏం జరిగిందంటే ..

Advertisement

అసలు లొకేషన్ లో ఏం జరిగిందంటే ..బాలయ్య ఉదయాన్నే ఐదు నుంచి ఆరు గంటల మధ్య పనులన్నీ పూర్తి చేసుకొని 7:30 నుంచి 8 గంటల మధ్యలోనే టిఫిన్ చేసి ఫుల్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ రెడీ అయిపోయాడట.ఇక కార్వాన్ లో రెడీగా ఉన్న బాలయ్యను ఫైట్ ప్రాక్టీస్ కోసం డైరెక్టర్ గోపీచంద్ లొకేషన్ లోకి పిలిచారు.
అలా బాలయ్య కార్వాన్ దిగి బయటకి నాలుగు అడుగులు వేశాడో లేదో సడన్ గా కాలి నరం గట్టిగా పట్టేసింది.దాంతో నడవలేనంతగా నొప్పి బాగా కావడంతో బాలయ్యని అక్కడి టీమ్ వెంటనే కాకినాడలోని పైవేట్ ఆసుపత్రికి తరలించింది.

ఇదివరకే ఆ కాలి నరంలో బ్లడ్ క్లాట్

ఇక అక్కడి నుండి హైదరాబాద్ AIGకి చేరుకున్న బాలయ్య ని డాక్టర్లు చెక్ చేసి చిన్నపాటి సర్జరీ అవసరమని చెప్పడంతో అసలు విషయం బయటపడింది.
ఇన్సైడ్ టాక్ ప్రకారం ..బాలయ్యకి ఇదివరకే ఆ కాలి నరంలో బ్లడ్ క్లాట్ అయిపోయి (చిట్లిపోయి) ఉందట. అది పూర్తిగా తగ్గక ముందే కాకినాడ కాకినాడ పోర్టులో యాక్షన్ సీక్వెన్స్ కోసం రెడీ అయిన బాలయ్య ని తిరిగి మళ్లీ ఆ గాయం తిరగబెట్టి ఇబ్బంది పెట్టిందని సమాచారం.అయితే వెంటనే డాక్టర్లు ఆ మజిల్ టియర్ ప్రాబ్లం సెట్ చేసి చికిత్స అని ఇచ్చినప్పటికీ ఆయనకు కనీసం రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ కావాలని కండిషన్ పెట్టారట.

Also read :జబర్దస్త్ వర్ష సంపాదన చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!

సంక్రాంతి రేస్ నుంచి కూడా పూర్తిగా అవుట్

ఇక  బాలయ్య హెల్త్ అప్ డేట్ చూస్తుంటే ఇప్పుడు NBK 111 సినిమా రిలీజ్ డేట్ పై గట్టి దెబ్బ కొట్టేలా కనిపిస్తుంది. మొదటగా ఈ సినిమాని డిసెంబర్ చివర్లో అనుకున్నారు మేకర్స్ అయితే బాలయ్య త్వరగా రికవరీ అయితే కనీసం పొంగల్ బరిలో అయినా దించాలని అనుకున్నారు.అయితే ఇప్పుడు తాజాగా బాలయ్య కి రెండు నెలల బెడ్ రెస్ట్ ఉండాల్సి రావడంతో ఈ సినిమా డిసెంబర్ రేస్ నుంచే కాదు సంక్రాంతి రేస్ నుంచి కూడా పూర్తిగా అవుట్ అయినట్లే కనిపిస్తుంది .

బడా హీరోలంతా ఇదే సంక్రాంతికి

మరోవైపు ఇదే బడా హీరోలంతా ఇదే సంక్రాంతికి కర్చీఫ్ వేసిన సంగతి తెలిసిందే. బాబి కొల్లి కాంబినేషన్లో చిరంజీవి 158 సినిమా ఒకవైపు రెడీ అవుతుండగా, మరోవైపు నాగార్జున తన వందో సినిమాని కూడా సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నాడట.ఇప్పటికే వెంకీ మామ, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాని కూడా సంక్రాంతి కె రిలీజ్ చేస్తామని చెప్పేశారు మేకర్స్ .ఇక సినిమా టైటిల్ కూడా జనవరి 13అంటున్నారు.చూడాలి.

మరోవైపు శర్వానంద్ కూడా శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాని సంక్రాంతికి వదలబోతున్నాడట. మరోవైపు రవితేజ, శ్రీ విష్ణు కాంబినేషన్లో వస్తున్న వీరాధివీరులంట సినిమాని కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడట .

మొత్తానికి దాదాపు 6 సినిమాలు బరిలో ఉన్న ఈ సమయంలోబాలయ్య త్వరగా రికవరీ అయి స్పీడ్ అప్ చేసి సంక్రాంతికి వదులుతాడా లేక రిలాక్స్ గా తర్వాత చూసుకుందాంలే అంటూ సినిమాని మెల్లిగా మొదలెడతాడు కాలమే డిసైడ్ చేయాలి!

Related News

మంగళవారం సీక్వెల్ పై డైరెక్టర్ బిగ్ అప్డేట్.. ఈసారి అంతకుమించి అంటూ!

నాని చేతులు దాటిపోతున్న ‘ది ప్యారడైజ్’? అసలు లోపల ఏం జరుగుతోంది!

ప్రమోషన్స్ గట్టిగా మొదలుపెట్టిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!

జబర్దస్త్ వర్ష సంపాదన చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!

జన నాయగన్ టీమ్ మోసం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి.. వీడియో వైరల్!

మళ్లీ తప్పని నిరాశ.. ఆఖరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా!

నన్ను మోసం చేశారు.. ఫస్ట్ రెమ్యూనరేషన్ పై విజయశాంతి కామెంట్!

Big Stories

Advertisement
×