E-Paper
Advertisement

బేస్మెంట్ లోని సొరంగంలోకి ఆత్మలను లాక్కెళ్ళే దుష్టశక్తి… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

బేస్మెంట్ లోని సొరంగంలోకి ఆత్మలను లాక్కెళ్ళే దుష్టశక్తి… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్
Advertisement

Supernatural Horror Thriller: విశ్వాసం అంటే కుక్కలు, కుక్కలు అంటే విశ్వాసం… మనుషులను నమ్మడం కంటే కుక్కను నమ్మడం మేలు. అందుకే ఎంతోమంది కుక్కలను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు. వాటిలో ఏకంగా దైవాన్ని కూడా చూసుకునే వాళ్ళు లేకపోలేరు. కానీ అదే కుక్క దెయ్యం అయితే… ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా ? అయితే ఈ ‘గుడ్ బాయ్’ (Good Boy) సినిమా మీ కోసమే. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

టాడ్ అనే వ్యక్తి మన హీరో. అతను తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతుంటాడు. అందుకే స్నేహితులు, కుటుంబానికి దూరంగా… ఎవ్వరూ లేకుండా ఒంటరిగా బతుకుతుంటాడు. అతనితో పాటు అతని ప్రాణ స్నేహితుడు, ఎంతో నమ్మకమైన ‘ఇండీ’ మాత్రమే ఉంటుంది. ఇండీ అంటే నోవా స్కోటియా డక్ రిట్రీవర్ జాతి కుక్క. చనిపోయిన తన తాతయ్యకు చెందిన ఒక పాత గ్రామీణ ఫామ్‌హౌస్‌కు ఇండీతో కలిసి షిఫ్ట్ అవుతాడు.

Advertisement

ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుండి ఇండీకి ఏదో తేడాగా అనిపిస్తుంది. మనుషులకు కనిపించని కొన్ని అదృశ్య అతీంద్రియ శక్తులు, దెయ్యాలు తిరగడాన్ని ఆ కుక్క గుర్తిస్తుంది. రాత్రి వేళల్లో బేస్‌మెంట్‌లో, గది మూలల్లో చీకటి శక్తులు తిరగడం, టాడ్ ప్రాణాలకు హాని తలపెట్టడానికి ప్రయత్నించడం ఇండీ గమనిస్తుంది. పైగా అప్పుడప్పుడు దానికి ఒక కుక్క ఆత్మ కూడా కనిపిస్తుంది. పైగా అది హెచ్చరిస్తుంది. క్లైమాక్స్ లో ఆ కుక్క ఎవరు ? దాని గతం ఏంటి ? అన్న విషయాలు బయట పడతాయి.

అనారోగ్యంగా ఉన్న యజమానిని ఆ క్షుద్ర శక్తులు నరకానికి తీసుకువెళ్లకుండా కాపాడటానికి ఆ మూగజీవం ఒంటరిగా ఎలా పోరాడింది ? చీకట్లో దాగి ఉన్న ఆ శక్తులను ఎలా తరిమి కొట్టింది ? అనేదే ఈ సినిమా కథ. చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా, సినిమా మాత్రం బాగుంటుంది. హర్రర్ సినిమాలంటే ఎప్పుడూ దెయ్యాలు, మనుషులు, దేవుళ్లేనా ? అప్పుడప్పుడూ ఇలా విచిత్రంగా వచ్చే సినిమాలను కూడా చూడాలి. ఇందులో సినిమా అంతా కుక్క చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా డాగ్ లవర్స్ కు అయితే ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది.

తెలుగులో మాత్రం లేదు

Advertisement

ఒక పెంపుడు కుక్క తన యజమాని జీవితాన్ని కాపాడుకోవడానికి చేసిన అసాధ్య పోరాటం ఆధారంగా రూపొందిన వినూత్నమైన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం ‘గుడ్ బాయ్’. 2025లో తెరపైకి వచ్చిన ఈ సినిమాకు బెన్ లియోన్‌బర్గ్ దర్శకత్వం వహించారు. చాలా తక్కువ డైలాగ్స్‌తో, భయంకరమైన వాతావరణంతో, పూర్తిగా కుక్క దృక్కోణంతో కథ సాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు. ఒకవేళ ఖచ్చితంగా చూడాలి అనుకుంటే ఇంగ్షీషులో చూడవచ్చు.

Read Also: ఫహాద్ ను ముప్పుతిప్పలు పెట్టే ముసలావిడ… మస్ట్ వాచ్ మలయాళ ఫీల్-గుడ్ అడ్వెంచర్ కామెడీ డ్రామా

Related News

రౌడీని రంగంలోకి దింపే చర్చ్… ఓటీటీలోకి వచ్చిన మలయాళ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. అక్కడే అసలు ట్విస్ట్!

దేవత కళ్ల నుండి కారే రక్తం… ఈ దెయ్యం చేసే పని చూస్తే దిమాక్ కరాబ్

స్కూల్ డేస్ ను గుర్తు చేసే ఎమోషనల్ జెమ్… ప్రతీ ఒక్కరికీ కనెక్టయ్యే కామెడీ వెబ్ సిరీస్

17 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ అఘాయిత్యం… 7.5 రేటింగ్ తో అదరగొడుతున్న సినిమా తెలుగులోనే

ముల్లోకాలను శాసించే శక్తి గల బ్రహ్మకమలం దొంగతనం… తెలుగు మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ వినోదం .. ఒక్కరోజు 17 సినిమాలు స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×