E-Paper
Advertisement

బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొరటాల శివ ‘NBK112’ ముహూర్తం ఫిక్స్..

బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొరటాల శివ ‘NBK112’ ముహూర్తం ఫిక్స్..
Advertisement

NBK112 Muhurtham: టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుల వేటకు ముహూర్తం ఖరారైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘#NBK112’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అధికారిక ముహూర్తపు వేడుక జూన్ 25, 2026 గురువారం ఉదయం 9:00 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి పరిధిలో గల వెంకటపాలెం టి.టి.డి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరగనుంది.

Read also-Pollard Vs Milind: పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు

Advertisement

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణ నటనకు, సామాజిక బాధ్యతతో కూడిన సందేశాన్ని కమర్షియల్ పంథాలో అందించే కొరటాల శివ మార్క్ మేకింగ్‌కు ఈ చిత్రం అద్దం పట్టనుంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో “Power meets purpose; Mass becomes a movement” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త పవర్‌ఫుల్ లుక్ మరియు సామాజిక కోణం ఉన్న పాత్రలో కొరటాల శివ ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు కీలక మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ రానున్నారు.

Read also-బాలీవుడ్ నటుడు సోదరుడిపై దాడి.. పరిస్థితి విషమం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు!

Advertisement

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్’ (సుధాకర్ చెరుకూరి), ‘యువసుధ ఆర్ట్స్’ (సుధాకర్ మిక్కిలినేని) అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పూజా కార్యక్రమాల రోజే సినిమాకు సంబంధించిన పూర్తి క్యాస్టింగ్ మరియు సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఆగస్టు మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. బాలయ్య మాస్ పవర్, కొరటాల శివ స్క్రీన్ ప్లే మ్యాజిక్ కలిసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

రణ్‌బీర్ కంటే ముందే రాముడిగా సల్మాన్.. కానీ చివరికి జరిగింది ఇదే!

బ్లడ్‌బాత్‌తోనే పాన్ ఇండియా హీరో అవుతావా నాని ?

జి.డి. నాయుడు ఎవరో తెలుసా?.. ఆయన కథ ఇప్పుడు వెండితెరపై!

‘కొరియన్ కనకరాజు’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

51 షోలు ఓపెన్.. 48 హౌస్‌ఫుల్..దుమ్మురేపుతున్న కొరియన్ కనకరాజు !

‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!

పట్టు చీరల నుంచి డిజైనర్ వేర్ వరకు.. హీరోయిన్ల ఖరీదైన కలెక్షన్స్!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

Big Stories

Advertisement
×