Best Samsung double door refrigerator India: మన ఇండియన్ కిచెన్స్‌లో ఫ్రిజ్ అనేది కేవలం ఒక వస్తువు కాదు. అది మన ఫ్యామిలీలో ఒక పార్ట్! ముఖ్యంగా ఎండలు మండిపోతున్నా లేదా కూరగాయలు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండాలన్నా నమ్మకమైన బ్రాండ్ కావాలి. అందుకే.. లాంగ్-టర్మ్ కూలింగ్‌తో పాటు, వైఫై కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్స్‌తో ఇండియన్ మార్కెట్‌ని రూల్ చేస్తున్న టాప్ 5 శామ్‌సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్ హోమ్‌గా మారాలనుకునే.. ప్రతి ఒక్కరికీ ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్.
ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు ఫ్రిజ్ అంటే కేవలం నీళ్లు చల్లబరచడానికి, మిగిలిపోయిన కూరలు దాచడానికి మాత్రమే వాడేవాళ్లం. కానీ.. ఇప్పుడు స్మార్ట్ హోమ్స్ జమానా నడుస్తోంది. మనం ఆఫీసులో ఉన్నా సరే.. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ టెంపరేచర్‌ని ఫోన్‌తో కంట్రోల్ చేసే రేంజ్‌కి టెక్నాలజీ వెళ్ళిపోయింది. ఈ విషయంలో శామ్‌సంగ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇండియన్ హోమ్స్ నీడ్స్‌ని బేస్ చేసుకుని, లాంగ్-టర్మ్ కూలింగ్ ఇంకా స్మార్ట్ ఫీచర్స్‌తో అలరిస్తున్న ఆ టాప్ 5 డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ల విశేషాలు ఇవే..
1. శామ్‌సంగ్ కన్వర్టిబుల్ 5-ఇన్-1 రెఫ్రిజిరేటర్ (Samsung Convertible 5-in-1):
ఈ ఫ్రిజ్ ఒక మ్యాజిక్ లాంటిది. మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ లేదా పండగలను బట్టి స్పేస్ సరిపోకపోతే.. కేవలం ఒక్క బటన్ నొక్కి ఫ్రీజర్‌ని కూడా నార్మల్ ఫ్రిజ్‌గా మార్చేయొచ్చు. ఇందులో ఉండే 5 రకాల మోడ్స్ మీ అవసరానికి తగ్గట్టు పవర్‌ని సేవ్ చేస్తాయి.
2. ట్విన్ కూలింగ్ ప్లస్ మోడల్స్ (Twin Cooling Plus Technology):
ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్‌క్రీమ్.. ఉల్లిపాయ వాసన వస్తే ఎలా ఉంటుంది? అస్సలు నచ్చదు కదా! అందుకే శామ్‌సంగ్ ‘ట్విన్ కూలింగ్ ప్లస్’ టెక్నాలజీని తెచ్చింది. ఇది ఫ్రిజ్ , ఫ్రీజర్‌కి విడివిడిగా కూలింగ్ ఇస్తుంది. దీనివల్ల వాసనలు కలవవు, పైగా కూరగాయలు రెండు రెట్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
3. స్మార్ట్‌థింగ్స్ వైఫై కనెక్టివిటీ ఫ్రిజ్ (SmartThings Wi-Fi Connected):
ఇది ప్యూర్ స్మార్ట్ హోమ్ లవర్స్ కోసం! ఈ ఫ్రిజ్‌లో వైఫై సపోర్ట్ ఉంటుంది. మీ ఫోన్‌లోని Samsung SmartThings యాప్ ద్వారా ఫ్రిజ్ ఎంత కరెంట్ కాలుస్తుందో ట్రాక్ చేయొచ్చు. ఏదైనా డోర్ ఓపెన్ ఉంటే ఫోన్‌కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కూలింగ్ మోడ్స్ కూడా ఫోన్ నుంచే మార్చుకోవచ్చు.
4. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ విత్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్:
ఇండియాలో పవర్ కట్స్, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కామన్. అందుకే శామ్‌సంగ్ తన డబుల్ డోర్ ఫ్రిజెస్‌లో అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌ని వాడుతోంది. ఇది తక్కువ సౌండ్ చేస్తుంది, తక్కువ కరెంట్ వాడుకుంటుంది. దీనికి విడిగా స్టెబిలైజర్ కూడా అక్కర్లేదు. పైగా ఈ కంప్రెసర్‌పై శామ్‌సంగ్ ఏకంగా 20 ఏళ్ల వారంటీ ఇస్తోంది.
5. కర్డ్ మేస్ట్రో రెఫ్రిజిరేటర్ (Samsung Curd Maestro™):
పెరుగు తోడెయ్యడం ఒక పెద్ద టాస్క్ అని ఫీలయ్యే వాళ్లకు ఇది వరప్రసాదం. ఈ ఫ్రిజ్‌లోనే పెరుగు తోడెట్టుకునే స్పెషల్ కంపార్ట్‌మెంట్ ఉంటుంది. ఎండాకాలం అయినా, చలికాలం అయినా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో గడ్డ పెరుగు రెడీ అయిపోతుంది.
Also Read: రూ.12 వేలలోపు బెస్ట్ పార్టీ స్పీకర్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు కేక పుట్టించే సౌండ్!
ఎందుకు ఇవి బెస్ట్ ఛాయిస్?
జనాలు రియల్-లైఫ్ యూజ్ అండ్ వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్‌ని సర్చ్ చేస్తున్నారు. శామ్‌సంగ్ డబుల్ డోర్ ఫ్రిజెస్ కేవలం కూలింగ్ మాత్రమే కాదు. ‘ఇండియన్ కిచెన్ ప్రాబ్లమ్స్’ కి స్మార్ట్ సొల్యూషన్స్ ఇస్తున్నాయి. గ్లాస్ ఫినిషింగ్, లక్స్ డిజైన్స్‌తో ఇవి మీ కిచెన్ లుక్‌ని మార్చేస్తాయి.
లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద ఒక మంచి ఫ్రిజ్ కొనాలనుకుంటే.. కళ్లు మూసుకుని శామ్‌సంగ్ డబుల్ డోర్ వేరియంట్స్‌ని చూస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫీచర్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ పవర్ సేవింగ్ . బ్రాండ్ నమ్మకం.. అన్నీ కలిపితేనే ఈ శామ్‌సంగ్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్.