E-Paper
Advertisement

బాలీవుడ్ నటుడు సోదరుడిపై దాడి.. పరిస్థితి విషమం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు!

బాలీవుడ్ నటుడు సోదరుడిపై దాడి.. పరిస్థితి విషమం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు!
Advertisement

Pankaj Tripathi Brother: ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు బిజేంద్ర నాథ్ తివారీపై బీహార్‌లో మారణాయుధాలతో ఘోర దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read also-మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ మైథలాజికల్ మూవీకి పాతికేళ్లు.. అప్పుడే ఆ రూల్ బ్రేక్…

Advertisement

పోలీసుల కథనం ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలో బిజేంద్ర నాథ్ తివారీపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను పాట్నాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకోవడానికి ముమ్మరంగా దాడులు (రైడ్స్) నిర్వహిస్తున్నారు.

‘నవభారత్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ గ్రామంలో ఈ ఘోర దాడి జరిగింది. బిజేంద్ర నాథ్ తివారీతో ఉన్న ‘దీర్ఘకాలిక శత్రుత్వం’ వల్లే దుండగులు ఆయనను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

గ్రామంలో మాటు వేసిన దాడికోరులు, ఆయన రాగానే ఒక్కసారిగా మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో బిజేంద్ర తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అత్యవసర చికిత్స కోసం మోడల్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, ఆయన పరిస్థితి ‘అత్యంత విషమంగా’ ఉందని వెల్లడించారు.

Read also-Podarillu Today Episode : చక్రీని చూసి షాకైన మహా.. మాధవ్ కు ఘోర అవమానం..ఇంట్లోంచి మహా వెళ్ళిపోతుందా..?

దాంతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఆయనను పాట్నా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు చికిత్స అందుతోంది. మరోవైపు, ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు.

Related News

రణ్‌బీర్ కంటే ముందే రాముడిగా సల్మాన్.. కానీ చివరికి జరిగింది ఇదే!

బ్లడ్‌బాత్‌తోనే పాన్ ఇండియా హీరో అవుతావా నాని ?

జి.డి. నాయుడు ఎవరో తెలుసా?.. ఆయన కథ ఇప్పుడు వెండితెరపై!

‘కొరియన్ కనకరాజు’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

51 షోలు ఓపెన్.. 48 హౌస్‌ఫుల్..దుమ్మురేపుతున్న కొరియన్ కనకరాజు !

‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!

పట్టు చీరల నుంచి డిజైనర్ వేర్ వరకు.. హీరోయిన్ల ఖరీదైన కలెక్షన్స్!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

Big Stories

Advertisement
×