E-Paper
Advertisement

అమెరికాలో తెలుగు యువకుడి ఆకస్మిక మరణం.. ట్రైనింగ్ క్లాస్‌లో ఊహించని విధంగా

అమెరికాలో తెలుగు యువకుడి ఆకస్మిక మరణం.. ట్రైనింగ్ క్లాస్‌లో ఊహించని విధంగా
Advertisement

America: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చనిపోతున్న తెలుగు విద్యార్థుల ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో కొందరు, గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరికొందరు, అనారోగ్యం కారణంగా ఇంకొందరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతి చెందాడు.

అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Advertisement

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల బొల్లెందుల అరుణ్ సాయిరెడ్డి ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. వెంకట్ రెడ్డి-సరళా రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు.చదువు పూర్తి కావడంతో ఉద్యోగం విషయంలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ప్రస్తుతం ఫ్లోరిడాలోని టెంపా సిటీలో ఉంటున్నాడు. అక్కడ స్టెమ్ ఓపీటీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఏం జరిగిందో తెలీదుగానీ జూన్ 19న అరుణ్ సాయిరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే స్నేహితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి, అనారోగ్యం ఆ తర్వాత ఆసుపత్రిలో మృతి

పరిస్థితి విషమించడంతో అరుణ్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. అరుణ్ సాయిరెడ్డి మృతి చెందిన విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాకయ్యారు. ఎదిగిన కొడుకు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడాన్ని తట్టుకోలేకపోలేదు. చిన్న వయసులో కొడుకు దూరమయ్యాడనే వార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అరుణ్ సాయిరెడ్డి పార్థివ దేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రవాస తెలుగు సంఘాలు, స్నేహితులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అరుణ్ సాయిరెడ్డి మృతికి మరిన్ని కారణాలు తెలియాల్సివుంది. తమ కొడుకును ఎలాగైనా రాష్ట్రానికి రప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ALSO READ: పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక.. షాకైన కొనుగోలుదారుడు, రంగంలోకి అధికారులు 

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×