E-Paper
Advertisement

GHMC property tax: ట్యాక్స్ గణాంకాల్లో అన్నీ తప్పులే.. వాస్తవానికి వసూలైంది ఎంత? ప్రకటించింది ఎంత?

GHMC property tax: ట్యాక్స్ గణాంకాల్లో అన్నీ తప్పులే.. వాస్తవానికి వసూలైంది ఎంత? ప్రకటించింది ఎంత?
Advertisement

GHMC property tax: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో పెద్ద కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీ పేరు గొప్ప, ఊరు దిబ్బగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. వేల కోట్లలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను ఫిక్స్ చేస్తున్న అధికారులకు కనీసం జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని ఆస్తులున్నాయి? జోన్ల వారీగా జరిగి ట్యాక్స్ కలెక్షన్ ఎంత అన్న కనీస అవగాహన లేదన్న విషయం తేలిపోయింది. ప్రతి ఆర్థిక సంవత్సరం టార్గెట్ ప్రకారం ట్యాక్స్ వసూలు చేస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని పక్కన బెట్టి, ఎన్ని ఆస్తుల నుంచి ఎంత వసూలు చేశాం, అన్ని జోన్లలో కలిపి ఎంత వసూలైందన్న కనీసం గణాంకాలు జారీ చేయటంలోనూ అధికారుల నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శించినట్లు వాదనలున్నాయి.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, వన్ టైమ్ సెటిల్ మెంట్, మొత్తం కలెక్షన్, తదుపరి కలెక్షన్ టార్గెట్లు వంటి అంశాలకు సంబంధించి అధికారులు అధికారికంగా జారీ చేసిన ప్రకటన మొత్తం తప్పుుల తడకగా మారిందన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో వేల కోట్లలో పేరుకుపోయిన ట్యాక్స్ మొండి బకాయిల వసూళ్ల కోసం సర్కారు గత డిసెంబర్ మాసంలోనే వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత మొండి బకాయిదారులకు ఈ స్కీమ్ పై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టడంలో విఫలమైందనే చెప్పవచ్చు.

Advertisement

Also Read: CM Chandrababu Naidu: బ్లాక్ మార్కెట్‌కు వెళ్తే కఠిన చర్యలు.. గ్యాస్ సరఫరాపై అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

కేవలం పది శాతం ఆస్తులకే ఓటీఎస్ అమలు

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 28 లక్షల 80 వేల 260 ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లుండగా, జీహెచ్ ఎంసీ పరిధిలో 8.82 లక్షల మేరకు రెసిడెన్షియల్, మరో 2.63 నాన్ రెసిడెన్షియల్ ఆస్తులున్నట్లు ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. గత నెల 11వ తేదీన కొత్తగా పునర్విభజించిన జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం 11 లక్షల 45 వేల పీటీఐఎన్ లున్నట్లు కమిషనర్ తెలిపారు. కానీ డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన ఓటీఎస్ స్కీమ్ ను ఆశించిన స్థాయిలో అమలు చేయలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ సోమవారం జారీ చేసిన ప్రకటనలో ఇప్పటి వరకు కేవలం లక్షా 11 వేల 835 పీటీఐఎన్ లు మాత్రమే ఓటీఎస్ కింద పన్ను చెల్లించినట్లు పేర్కొన్నారు. మొత్తం జీహెచ్ఎంసీ పీటీఐఎన్ లు 11 లక్షల 45 వేలుండగా, ఓటీఎస్ కింద చెల్లించిన ఆస్తులు కనీసం పది శాతం కూడా లేకపోవటం ఓటీఎస్ అమలు పట్ల జీహెచ్ఎంసీ అధికారులు వహించిన నిర్లక్ష్యం, అశ్రద్ధకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. అంతేగాక సోమవారం అధికారికంగా జారీ చేసిన ప్రకటనలో ఇప్పటి వరకు ట్యాక్స్ చెల్లించిన మొత్తం పీటీఐఎన్ నెంబర్ల సంఖ్యను 6.31 గా పేర్కొనగా, ట్యాక్స్ చెల్లించాల్సిన బ్యాలెన్స్ ఇండెక్స్ నెంబర్ల సంఖ్యను 5.13గా పేర్కొన్నారు. 6.31 ప్లస్ 5.13 కలిపితే మొత్తం పీటీఐఎన్ సంఖ్య 11.44 గా వస్తుంది. అధికారులు పేర్కొన్న మొత్తం పీటీఐఎన్ ల సంఖ్య 11.45 లక్షలు కాగా, ఇందులో వెయ్యి పీటీఐఎన్ లు ఏమైనట్లు అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

జోన్ల వారీగా ట్యాక్స్ కలెక్షన్ లోనూ అయోమయం

Advertisement

ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో చేసిన ట్యాక్స్ కలెక్షన్ వివరాల్లో కూడా అయోమయం గందరగోళం నెలకొంది. మొత్తం ట్యాక్స్ కలెక్షన్ ను రూ. 824 కోట్లుగా ప్రకటనలో అధికారులు పేర్కొన్నా, ఆరు జోన్ల వారీగా చేసిన కలెక్షన్ గణాంకాలను కలిపితే మొత్తం 823.72 కోట్లు వస్తుంది. పైన పేర్కొన్న టేబుల్ లో మొత్తం కలెక్షన్ ను రూ. 824 కోట్లుగా పేర్కొనగా, జోన్ల వారీగా వచ్చిన కలెక్షన్లను టోటల్ చేసిన అధికారులు టేబుల్ లో రూ. 823.72 కోట్లుగా పేర్కొనగా, అధికారులు పేర్కొన్న రూ. 824 కోట్లలో మిగిలిన రూ. 28 లక్షల ఏమైనట్లు అన్న ప్రశ్న తలెత్తుతుంది. అధికారులు లెక్కల్లో పూరా? లేక జరిగిన కలెక్షన్ ను ఏమైనా తప్పుుదోపట్టిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Collector Rizwan Basha: రైతులకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా చేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×