E-Paper
Advertisement

ఓజీ 2 అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. పవర్‌స్టార్ ప్యాన్స్‌కి పూనకాలే

ఓజీ 2 అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. పవర్‌స్టార్ ప్యాన్స్‌కి పూనకాలే
Advertisement

OG Sequel: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సరికొత్త రికార్డుల విధ్వంసానికి వేదిక సిద్ధమవుతోంది. టాలీవుడ్‌ను ఊపేసిన మోస్ట్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG) రెండో భాగానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. రన్‌ రాజా రన్, సాహో సత్తా చాటిన  యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గత ఏడాది సెప్టెంబరులో విడుదలైన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడమే కాకుండా, పవన్‌కల్యాణ్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది. పవన్ మార్క్ యాటిట్యూడ్, ముంబై బ్యాక్‌డ్రాప్ గ్యాంగ్‌స్టర్ విజువల్స్ వెండితెరపై పూనకాలు తెప్పించడంతో ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది.

also read :94 ఏళ్ల ‘భీష్మాచార్యుడు’ సింగీతంపై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ పోస్ట్.. నెట్టింట వైరల్!

Advertisement

సినిమా ప్రమోషన్స్ సమయం నుంచే ఈ కథకు సంబంధించి బోలెడంత కంటెంట్ మిగిలి ఉందని, అన్నీ కుదిరితే ఖచ్చితంగా ‘ఓజీ 2’ ఉంటుందని దర్శకుడు సుజీత్ హింట్స్ ఇస్తూనే వచ్చారు. తాజాగా ఈ నిరీక్షణకు తెరదించుతూ పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చేసింది. ప్రామిస్ చేసినట్లుగానే ఆయన వస్తున్నారని, ఎప్పుడనేది ఆయనే స్వయంగా ప్రకటిస్తారని పేర్కొంది. ప్రస్తుతం సుజీత్ ఫారిన్ ట్రిప్ లో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన వెంటనే ‘ఓజీ 2’ స్క్రిప్ట్ చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ స్పీడప్ అవుతాయని ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

నిజానికి ‘ఓజీ’ చిత్రానికి ప్రీక్వెల్, సీక్వెల్ రెండూ ఉంటాయని గతంలోనే పవన్‌కల్యాణ్ స్వయంగా చెప్పి అంచనాలు పెంచేశారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, సినిమా కోసం ఆయన కేటాయించిన డేట్స్, చూపించిన డెడికేషన్ అద్భుతమనే చెప్పాలి. పవన్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిన ‘ఖుషి’ విడుదలై రెండు దశాబ్దాలు దాటినా, ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్స్ వచ్చినా, ‘ఓజీ’ క్రియేట్ చేసిన హైప్ మాత్రం నెక్స్ట్‌ లెవల్‌లో ఉంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా మెప్పించారు. ప్రకాష్ రాజ్, శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ వంటి స్టార్ క్యాస్ట్  ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో రీసౌండ్ తెప్పించింది.

ఈ సినిమా అయినా మెగా ఆకలి తీరుస్తుందో లేదో !

ప్రస్తుతం దర్శకుడు సుజీత్ నేచురల్ స్టార్ నాని హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నాని సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సుజీత్ పూర్తి ఫోకస్ ‘ఓజీ’ తదుపరి భాగంపైనే పెట్టనున్నారు. అది ప్రీక్వెల్ అవుతుందా లేక సీక్వెల్ రూపంలో వస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ, పవర్‌స్టార్‌ను మళ్లీ ఆ గన్‌ పట్టిన గ్యాంగ్‌స్టర్ అవతారంలో చూడటానికి ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా అయినా మెగా ఆకలి తీరుస్తుందో లేదో !

also read :అభిమానులపై మళ్లీ ఫైర్ అయిన బాలయ్య.. విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్!

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×