Mohammad Amir: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 ( Indian Premier League Tournament 2026) మొన్నటి వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ కు పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ మాత్రం చాలా చక్కగా సాగింది. వ్యూయర్షిప్ పరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ రికార్డు సృష్టించగా… పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఐపీఎల్ టోర్నమెంట్ ప్రేక్షకులతో జరిగితే… పాకిస్తాన్ సూపర్ లీగ్ మాత్రం అభిమానులు లేకుండానే నిర్వహించి పీసీబీ పరువు తీసుకుంది. ఇలాంటి క్రమంలో ఐపిఎల్ టోర్నమెంట్ పై హాట్ కామెంట్స్ చేశారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir). మరో 30 నుంచి 40 సంవత్సరాలు పోయినా కూడా ఐపీఎల్ టోర్నమెంటును పాకిస్తాన్ సూపర్ లీగ్ దాటలేదని బాంబు పేల్చారు. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) సక్సెస్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir) హాట్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే ఐపిఎల్ టోర్నమెంట్ అత్యున్నత లీగ్ అంటూ వ్యాఖ్యానించారు. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ విజయవంతంగా 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రశంసించారు. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు చాలా టి20 లీగ్స్ పోటీగా వచ్చాయని.. కానీ ఏ టోర్నమెంట్ కూడా నిల్వ లేకపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఎప్పటికీ ఐపీఎల్ తోపు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు మహమ్మద్ అమీర్.
మరో 30 నుంచి 40 సంవత్సరాలు అయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును మాత్రం పాకిస్తాన్ సూపర్ లీగ్ బీట్ చేయలేదని పరుగు తీశారు. అంత బలంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఉందని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir). పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్ని చర్యలు తీసుకున్నా, బీసీసీఐని కొట్టలేదని.. ఈ విషయం గ్రహించి ముందుకు సాగాలని సూచనలు చేశారు. అనవసరంగా ఐపీఎల్ టోర్నమెంటుకు పోటీగా వెళ్లకూడదని కోరారు మహమ్మద్ అమీర్.
మొన్నటి వరకు ఐపీఎల్ టోర్నమెంటును పచ్చి బూతులు తిట్టిన మహమ్మద్ అమీర్… తనకు బ్రిటిష్ పౌరసత్వం వచ్చిన తర్వాత మాట మార్చారు. ఐపీఎల్ గొప్ప టోర్నమెంట్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బ్రిటిష్ పౌరసత్వం వచ్చిన నేపథ్యంలో ఐపీఎల్ ఆడే అవకాశం మహమ్మద్ అమీర్ కు ఉంటుంది. ఐపీఎల్ కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. అందుకే ఇలా నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడని మహమ్మద్ అమీర్ కు కౌంటర్ ఇస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్.