E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రభాస్ హీరోయిన్.. రెండో సినిమాకే?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రభాస్ హీరోయిన్.. రెండో సినిమాకే?
Advertisement

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజి’ (Fauji) చిత్రంతో వెలుగులోకి వచ్చిన మాన్విని సంప్రదిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ సరసన ఫ్రెష్ జోడీ అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు, ఆమెను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న మాన్వి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇప్పడు టాలీవుడ్ టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం మెండుగా ఉంది.

Read also-Mystery thriller OTT : స్టూడెంట్ ను వేధించే టీచర్… తల్లి ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు అవుట్

Advertisement

ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన ప్రస్తుత చిత్రాలైన ‘OG’, ‘హరి హర వీరమల్లు’ విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.ఈ లోపు స్క్రిప్ట్ వర్క్ మరియు నటీనటుల ఎంపికపై సురేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.

Read also-Thriller Movie OTT : తమ్ముడి చావుకి అన్న రివేంజ్… గ్యాంగ్ వార్ తో దద్దరిల్లే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Advertisement

ఒకవేళ ఈ వార్త నిజమైతే, మాన్వికి కెరీర్ ప్రారంభంలోనే ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించే అరుదైన అవకాశం దక్కినట్లవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే, ఈ హీరోయిన్ ఎంపికపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ఉగాది సందర్భంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×