Crime Thriller Series : ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ ను చూడాలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇది ఇప్పటి వరకు మూడు సీజన్లతో ఈ సిరీస్ తెగ సందడి చేసింది. దీనికి ఐఎండిబి లో 7.9/10 రేటింగ్ ఉందంటే ఇది ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఇది మనాలీలోని ఒక పవర్ ఫుల్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఒక పెళ్లి వేడుకలో జరిగిన హత్యతో మొదలయ్యే ఈ స్టోరీ ఊహించని ట్విస్ట్లు ఇస్తూ ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ కథ 2016లో పంజాబ్‌లోని బటిండాలో జరిగిన ఒక రియల్ సంఘటన ఆధారంగా రూపొందింది. ఒక పెళ్లి వేడుకలో డ్యాన్సర్‌ను కాల్చి చంపిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇక ఈ సిరీస్‌ను ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. అక్కడి మంచు కొండలు, అందమైన లొకేషన్ల మధ్య జరిగే క్రూరమైన హత్యలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి.
ఈ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ఉందేఖి’ (Undekhi). దీనిని సిద్దార్థ్ సేన్‌గుప్తా నిర్మించగా, ఆశిష్ ఆర్. శుక్లా డైరెక్ట్ చేశారు.
మీరు ఈ సిరీస్‌ను SonyLIV ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో చూడవచ్చు. ఇది తెలుగు ఆడియోతో పాటు హిందీ, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో హర్ష్ ఛాయా (పాపాజీ), సూర్య శర్మ (రింకూ), దిబ్యేందు భట్టాచార్య (DSP ఘోష్) ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 3 సీజన్లతో ఇప్పటివరకు 28 ఎపిసోడ్‌లు విడుదలయ్యాయి. మొదటి సీజన్ 10 ఎపిసోడ్‌లతో 2020లో మొదలై, అత్వాల్ ఫ్యామిలీ చేసే అరాచకాలను పరిచయం చేసింది. ఆ తర్వాత వచ్చిన రెండో సీజన్ కూడా 10 ఎపిసోడ్‌లతో 2022లో వచ్చి, రింకూ అత్వాల్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలను చూపించింది. ఇక మూడో సీజన్ 8 ఎపిసోడ్‌లతో 2024లో విడుదలై, కథలో మరిన్ని ట్విస్టులు తీసుకొస్తూ పాపాజీ గతాన్ని, పగను కళ్లకు కట్టింది. ఈ ఎపిసోడ్‌లన్నీ సుమారు 30 నుండి 45 నిమిషాల నిడివితో ఉండి, ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ఇక 4వ సీజన్ 2026 మేలో విడుదలయ్యే అవకాశం ఉంది.
మనాలీలో ఉండే అత్వాల్ అనే ఒక పెద్ద ఫ్యామిలీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీళ్లు ఊర్లో పెద్ద రౌడీలు, పైగా ఫుల్లుగా డబ్బు, పవర్ ఉన్నోళ్లు. ఒకరోజు అత్వాల్ ఇంట్లో పెళ్లి జరుగుతుండగా, ఆ ఇంటి పెద్దాయన పాపాజీ ఫుల్లుగా తాగి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న ఒక అమ్మాయిని అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపేస్తాడు. ఆ అరాచకాన్ని అక్కడ షూటింగ్ చేస్తున్న ఇద్దరు కుర్రాళ్లు తమ కెమెరాలో రికార్డ్ చేస్తారు. అక్కడి నుంచే అసలు రచ్చ మొదలవుతుంది. ఆ వీడియో బయటపడితే తమ పరువు పోతుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని అత్వాల్ కొడుకు రింకూ రంగంలోకి దిగుతాడు. సాక్ష్యం ఉన్న ఆ కెమెరాను, ఆ కుర్రాళ్లను వేటాడటం మొదలుపెడతాడు. ఈ లోపు బెంగాల్ నుంచి వచ్చిన ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఘోష్, ఆ హత్యకు న్యాయం చేయాలని గట్టిగా డిసైడ్ అవుతాడు. అటు పవర్ ఉన్న రౌడీలు, ఇటు న్యాయం చేయాలనుకునే పోలీస్ మధ్య ఆట రసవత్తరంగా సాగుతుంది. కథ ముందుకు వెళ్లేకొద్దీ, ఆ అత్వాల్ ఫ్యామిలీ లోపల ఉండే గొడవలు, కుట్రలు బయటపడతాయి. చనిపోయిన అమ్మాయి తరపు వాళ్లు కూడా రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తారు. ప్రతి సీన్ ఎంతో ఉత్కంఠభరితంగా, నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టు ఉంటుంది.
Read Also : ఇక్కడ దేవుడు లేడు… కేవలం దయ్యాల మనుషులే… మామూలు సినిమా కాదు క్లైమాక్స్ వరకు వణుకు