E-Paper
Advertisement

27 ఏళ్ల తర్వాత వెండితెరపై మ్యాజిక్.. నాగార్జున ‘కింగ్ 100’లో టబు రీ-ఎంట్రీ ఫిక్స్!

27 ఏళ్ల  తర్వాత వెండితెరపై మ్యాజిక్.. నాగార్జున ‘కింగ్ 100’లో టబు రీ-ఎంట్రీ ఫిక్స్!
Advertisement

Nagarjuna Tabu : అక్కినేని నాగార్జున వందో సినిమాలో టబు నటిస్తుందా లేదా అన్న ప్రశ్నకి ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది. యస్.. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో నేను నటిస్తున్నాను అంటూ చెప్పేసింది. తన అఫీషియల్ అకౌంట్‌లో “వి బిగిన్ కింగ్ 100” అని పోస్ట్ పెట్టి కన్ఫాం చేసేసింది టబు. దీంతో గత కొన్ని రోజులుగా వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా లేదా అన్న అనుమానాలకు ఈ పోస్ట్ పుల్ స్టాప్ పెట్టేసింది.

వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం

Advertisement

ఈ ఇద్దరి జోడీ విషయానికి వస్తే 1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’తో టబు నాగ్‌కు జోడీగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఈ సినిమా సాలిడ్ సక్సెస్ చూడటంతో ఈ పెయిర్ ఫుల్ పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా స్క్రీన్‌పై ఈ జోడీ పండించిన రొమాన్స్ చూసి వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందేమో అనుకున్నారు చాలా మంది. ఇక ఆ సినిమా తర్వాత 1998లో ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో కనిపించిన ఈ జోడీ మళ్లీ ఇప్పటి వరకు కలిసి కనిపించకపోవడం గమనార్హం.

‘అల వైకుంఠపురములో’తో సెకండ్ ఇన్నింగ్స్

Advertisement

ఇక తాజాగా దాదాపు 27 ఏళ్ల తర్వాత నాగ్ వందో సినిమాలో టబు నటిస్తుందన్న వార్తలకు క్లారిటీ రావడంతో మురిసిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇక ‘అల వైకుంఠపురములో’తో తెలుగులో గ్రాండ్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన టబు, పూరి డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ‘స్లమ్ డాగ్’ సినిమాలో కూడా కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నాగ్ వందో సినిమా విషయానికి వస్తే కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ విజన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగ్ తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, ఈ సినిమాలో హార్ట్ టచింగ్‌గా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

also read :యశ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మళ్ళీ వాయిదా పడనున్న ‘టాక్సిక్’? 250 కోట్ల డీలే కొంపముంచుతోందా!

నాగ చైతన్య, అఖిల్  గెస్ట్ రోల్స్‌?

ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వారిలో నాగ్‌కు కలిసొచ్చిన అనుష్క శెట్టి, అలాగే ‘నాట్యం’ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సుశ్మిత భట్ మిగతా రెండు పాత్రలు పోషిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది గానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా లేదు.

ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే నాగ్ తనయులు నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ‘మనం’లో ఎలాంటి మ్యాజిక్ చేశారో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇక రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వబోతున్నారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో మేకర్స్‌నే బయటపెట్టాలి.

ఏది ఏమైనా టాలీవుడ్ హిట్ పెయిర్‌గా నిలిచిన టబు, నాగ్ మరోసారి జోడీ కట్టడం అంటే అక్కినేని ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. చూడాలి మరి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నాగ్‌కి ఎలాంటి మెమోరీస్‌ని మిగిలిస్తుందో!

also read :పుష్ప 2 రేంజ్ హైప్.. కానీ ప్రమోషన్లు సున్నా! పెద్ది టీమ్ ప్లానింగ్ ఇంతేనా?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×