E-Paper
Advertisement

‘స్పిరిట్’ టైటిల్ వివాదంపై కన్నీరు పెట్టుకున్న నిర్మాత!.. అసలు ఏంజరిగిందంటే?

‘స్పిరిట్’ టైటిల్ వివాదంపై కన్నీరు పెట్టుకున్న నిర్మాత!.. అసలు ఏంజరిగిందంటే?
Advertisement

Spirit Controversy: టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) చుట్టూ ఇప్పుడు ఒక ఊహించని టైటిల్ వివాదం రాజుకుంది. ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుండి వచ్చిన లీగల్ నోటీసుల వల్ల రోడ్డున పడ్డామంటూ ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన మహిళా నిర్మాత నరసమ్మ ఓ మీడియా ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమయ్యారు.

Read also-సినిమా లవర్స్‌కు పూనకాలే.. సోనీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ హోమ్ థియేటర్ సిరీస్ లాంచ్!

Advertisement

ఈ వివాదంపై ఆమె నేరుగా హీరో ప్రభాస్‌కు హృదయవిదారక విజ్ఞప్తి చేశారు. ప్రభాస్ గారు చాలా మంచి వారని, పక్కవారి కష్టాన్ని దోచుకునే వ్యక్తి ఆయన కానే కాదని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మందికి సహాయం చేసే పెద్ద మనసున్న ప్రభాస్, తమ లాంటి చిన్న వారి బాధను కూడా అర్థం చేసుకోవాలని కోరారు.

“ఆ పెద్ద సినిమా వేరు, మా చిన్న సినిమా వేరు” అని ప్రభాస్ ఒక్క మాట చెబితే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తమ సినిమాను ఏదో ఒక మూల రిలీజ్ చేసుకుంటామని ఆమె వేడుకున్నారు. 13 ఏళ్ల క్రితం తమ సర్వస్వాన్ని, ఇల్లు వాకిలి, ఆస్తులను అమ్ముకుని ఎంతో ఇష్టంతో ఈ ‘స్పిరిట్’ అనే సినిమాను ప్రారంభించామని, ఇందులో తమ చనిపోయిన కొడుకు కూడా నటించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Read also-‘OG యూనివర్స్’ నుంచి బిగ్ అప్డేట్.. గంభీర ‘అన్‌టోల్డ్ స్టోరీ’తో ఊచకోతకు రెడీ!

తమకు ఎలాంటి డబ్బు ఆశ లేదని, కేవలం కొడుకు జ్ఞాపకంగా ఉన్న ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. మరి ఈ చిన్న నిర్మాతల ఆవేదన టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ వరకు చేరుతుందా? ఈ టైటిల్ వివాదానికి ఒక సానుకూల పరిష్కారం దొరుకుతుందా? అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×