E-Paper
Advertisement

‘OG యూనివర్స్’ నుంచి బిగ్ అప్డేట్.. గంభీర ‘అన్‌టోల్డ్ స్టోరీ’తో ఊచకోతకు రెడీ!

‘OG యూనివర్స్’ నుంచి బిగ్ అప్డేట్.. గంభీర ‘అన్‌టోల్డ్ స్టోరీ’తో ఊచకోతకు రెడీ!
Advertisement

OG Universe: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’ (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో పవన్ కల్యాణ్ మార్క్ యాటిట్యూడ్, సుజీత్ అదిరిపోయే టేకింగ్‌తో ఈ సినిమా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఈ చిత్రంలో పవన్ పోషించిన ‘ఓజస్ గంభీర’ క్యారెక్టర్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే, ఈ బ్లాక్‌బస్టర్ కథ ఇక్కడితోనే ముగిసిపోలేదు.. దీనిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు మేకర్స్ సరికొత్త ప్లాన్ రెడీ చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ (Pawan Kalyan Creative Works) అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా ఒక అప్‌డేట్‌ను వదిలింది. “#OGUniverse” సాగాను మరింత విస్తరిస్తూ సుజీత్, పవన్ కల్యాణ్ మళ్లీ చేతులు కలిపినట్లు అధికారికంగా ప్రకటించింది.

Read also-మావయ్య సినిమాకు అల్లుడు క్లాప్.. అమరావతిలో ‘NBK112’ గ్రాండ్ లాంచింగ్!

తుఫానుకు ముందు నిశ్శబ్దం..

Advertisement

“బిఫోర్ ది స్టార్మ్ అరైవ్స్… దేర్స్ ఏ మూమెంట్ ఆఫ్ సైలెన్స్. ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ గంభీర ఈజ్ రెడీ టు అన్‌ఫోల్డ్” (తుఫాను రావడానికి ముందు ఒక నిశ్శబ్దం ఉంటుంది… గంభీర యొక్క చెప్పని కథ విప్పడానికి సిద్ధంగా ఉంది) అంటూ మేకర్స్ షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మొదటి భాగంలో ‘గంభీర’ ముంబైని ఎలా రూల్ చేశాడు? అతని గతం ఏంటి? అనే అంశాలను ఈ సరికొత్త ప్రాజెక్ట్‌లో మరింత లోతుగా, పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నట్లు ఈ హింట్ ద్వారా స్పష్టమవుతోంది.

Read also-సుకుమార్, బన్నీ వాస్ ‘ఈడుపు కాగితం’ ఫస్ట్ లుక్‌ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్!

రంగంలోకి పవన్ కల్యాణ్

Advertisement

మొదటి భాగాన్ని డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ఇప్పుడు ఈ ‘OG యూనివర్స్’ విస్తరణలో పవన్ కల్యాణ్ సొంత బ్యానర్ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ భాగస్వామ్యం కావడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, కథా చర్చలు ఇప్పటికే ఊపందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Related News

నూతన ప్రసాద్ ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!

AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!

4K లేజర్, డాల్బీ అట్మాస్.. వైజాగ్‌ AAA సినిమాస్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!

Big Stories

Advertisement
×