బీట్‌రూట్, పనీర్‌తో చేసే హై ప్రోటీన్ దోశ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పుకోవచ్చు. బీట్‌రూట్‌లో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. పనీర్‌లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండింటి కలయికతో చేసే దోశె తిన్నవారికి శక్తి, హిమోగ్లోబిన్ పెరుగుదల, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు అందుతాయి. ఇంట్లో సులభంగా చేసే ఈ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ప్రోటీన్ దోశె రెసిపీకి కావలసిన పదార్థాలు
బీట్‌రూట్ – ఒకటి
పనీర్ – 100 గ్రాములు
శెనగపిండి – ఒక కప్పు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
అల్లం – చిన్న ముక్క
జీలకర్ర – అర స్పూన్
కొత్తిమీర తురుము – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – అవసరమైనంత
నూనె లేదా నెయ్యి – సరిపడినంత
Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో
ప్రోటీన్ దోశె రెసిపీకి కావలసిన పదార్థాలు
1. బీట్‌రూట్ తొక్క తీసి బాగా కడిగి తురమాలి. పనీర్‌ను చేతితో లేదా ఫోర్క్‌తో మెత్తగా చేసి పక్కన పెట్టాలి.
2. ఒక కప్పులో శెనగపిండి వేసి అందులో తురిమిన బీట్‌రూట్, పనీర్ , ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసి కలపాలి.
3. ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ గడ్డలు లేకుండా బాగా కలపాలి. పిండిని దోశ పిండిలా జారేలా కలుపుకోవాలి.
4. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. కాస్త నూనె వేయాలి. ఒక గరిటె పిండిని తీసుకుని పెనంపై పోసి దోశలా పలుచగా చేసుకోవాలి.
5. ఒక వైపు కాలిన తరువాత దోశెను తిప్పి మరో వైపు కూడా గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే టేస్టీ ప్రొటీన్ దోశ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
Also read: Green Mirchi Halwa: పచ్చిమిర్చితో హల్వా కూడా చేస్తారు తెలుసా? తింటే అదిరిపోతుంది కూడా
ఇక్కడ చెప్పిన దోశెను తింటే ఎంతో ఆరోగ్యకరం. రెండు దోశెలు తింటే చాలు పొట్ట నిండిపోతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటే సాయంత్రం వరకు చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పిండిని ఒక్కసారి కలుపుకుంటే నాలుగు రోజుల పాటూ ఫ్రిజ్ లో పెట్టి వాడుకోవచ్చు.