E-Paper
Advertisement

Band Melam Teaser: నాకు పెళ్లి చేసేయండి నాన్న..యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా బ్యాండ్ మేళం టీజర్

Band Melam Teaser: నాకు పెళ్లి చేసేయండి నాన్న..యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా బ్యాండ్ మేళం టీజర్
Advertisement

Band Melam Teaser:  కోర్టు సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరో–హీరోయిన్ హర్ష రోషన్ శ్రీదేవి.. ఇప్పుడు మరోసారి కలిసి వస్తున్న సినిమా బ్యాండ్ మేళం. ఈ సినిమా టీజర్‌ ఈరోజు విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ విషయానికి వస్తే.. మొదటి సీన్ నుంచే ఇది పూర్తిగా కామెడీతో నడిచే చిత్రం అని స్పష్టంగా అర్థమవుతుంది. టీజర్ మొదలు నుంచి చివరి వరకు నవ్వులు పూయించే సన్నివేశాలతో నిండిపోయాయి.

టీజర్ ప్రారంభంలోనే హీరోయిన్ “నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న” అని అందాల రాక్షసి సినిమా రిలీజ్ చేస్తూ ఉండగా.. పక్కన నాన్న కూడా ఆ రీల్ కి సహాయపడుతూ ఉంటారు. ఇక ఆమె నాన్న పాత్రలో సాయికుమార్ కనిపించాడు. “ఇక్కడ ఫోన్ సిగ్నల్ లేదు… ప్రకృతి ఇచ్చే సిగ్నల్ ఏంటి?” అనే డైలాగ్.. అలానే అంకుల్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చెప్పండి POCSO కేసు వేసేస్తాము.. అనే పంచు లైన్ డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

Advertisement

ఈ సినిమాలో హీరోగా హర్ష్ రోషన్, హీరోయిన్‌గా శ్రీదేవి అపల్లా నటిస్తున్నారు. కోర్టు సినిమాలో ఈ జంటకు మంచి గుర్తింపు వచ్చింది. అదే కెమిస్ట్రీ ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’లో కూడా కొనసాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. సహాయక పాత్రల్లో కూడా బలమైన కామెడీ ట్రాక్ ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. హీరో–హీరోయిన్ బావ–మరదలుగా కనిపించబోతున్నారనే విషయం కూడా టీజర్ ద్వారా క్లారిటీ ఇస్తుంది.

Advertisement

ఈ సినిమాను ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఇక నిన్ననే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘తిప్పుకుంటన్నావ్’ అనే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయడం విశేషం. ఈ పాటకు విజయ్ బుల్గణిన్ సంగీతం అందించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు అన్నింటినీ కలిపి ఒక హృద్యమైన కథగా ‘బ్యాండ్ మేళం’ రూపొందింది. ఈ సినిమా మార్చి 13న థియేటర్లలో విడుదల కానుంది. మొత్తానికి, ఫుల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి ‘బ్యాండ్ మేళం’ సిద్ధంగా ఉందని టీజర్ స్పష్టంగా చెబుతోంది.

ALSO READ: Vijay Rashmika: రెండుసార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ఎందుకంటే..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×