E-Paper
Advertisement

Appalanaidu On Jagan: జగన్ కుట్రలు బట్టబయలు చేసిన టీడీపీ ఎంపీ! లడ్డూ కల్తీ నుంచి హెరిటేజ్ అటాక్ వరకు.. అసలు నిజాలివే!

Appalanaidu On Jagan: జగన్ కుట్రలు బట్టబయలు చేసిన టీడీపీ ఎంపీ! లడ్డూ కల్తీ నుంచి హెరిటేజ్ అటాక్ వరకు.. అసలు నిజాలివే!
Advertisement

Appalanaidu On Jagan: టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అన్ని ఆధారాలను బయటపెట్టిందని.. ఈ విషయంలో జగన్ తన తప్పును ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.

హెరిటేజ్ సంస్థ జగన్ కంపెనీల మాదిరిగా అక్రమ మార్గాల్లో పుట్టింది కాదని అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఎంతో మంది మేధావుల ప్రశంసలు పొందిన హెరిటేజ్ సంస్థపై జగన్ బురద జల్లడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. నారా భువనేశ్వరి నాయకత్వంలో ఈ సంస్థ పారదర్శకంగా నడుస్తోందని.. గతంలో ఆమె ప్రజలను చైతన్యం చేస్తూ పర్యటించినందుకే కక్ష పూరితంగా జగన్ హెరిటేజ్ సంస్థను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న సంస్థపై కుట్రలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

హిందువుల మనోభావాలను గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని.. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని అప్పలనాయుడు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన కొత్త రాజకీయ సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ.. ప్రత్యర్థి పార్టీల నేతల కుటుంబ సభ్యులతో కూడా గౌరవంగా మాట్లాడే సంస్కృతిని లోకేష్ తీసుకొచ్చారని.. జగన్ పాలనలో ఇలాంటి గౌరవం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ నాలుగు గోడలకే పరిమితమై.. అక్కడ ఎవరో చెప్పిన విషయాలను పట్టుకుని గంటల తరబడి మీడియా ముందు మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. ప్రజలతో మమేకం కావడం కానీ.. కనీసం క్రికెట్ వంటి క్రీడలను ఆస్వాదించడం కానీ జగన్ వల్ల కాదని ఆయన మనస్తత్వం ఎప్పుడూ కుట్రలు, రాజకీయ లబ్ధి చుట్టూనే తిరుగుతుందని ఎంపీ అప్పలనాయుడు విమర్శించారు.

Advertisement

Also Read: రెండు నెలల పసికందు సజీవ దహనం.. ఆ తల్లి చేసిన పనికి కంగుతిన్న పోలీసులు!

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×