E-Paper
Advertisement

Actor Nani: నాని ఇండస్ట్రీలోకి రాకముందు చేసిన ఉద్యోగం ఇదేనా…ఏం చేశారంటే?

Actor Nani: నాని ఇండస్ట్రీలోకి రాకముందు చేసిన ఉద్యోగం ఇదేనా…ఏం చేశారంటే?

Actor Nani: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ సక్సెస్ అందుకోవడమంటే చాలా కష్టతరమైన పని. అయితే ఎంతోమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని రవితేజ నాని వంటి తదితరులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక టైర్ 2హీరోలలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పని చేసిన ఈయన ప్రస్తుతం హీరోగా పాన్ ఇండియా స్థాయి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రేడియో జాకీగా నాని..

ప్రస్తుతం నాని నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఫిబ్రవరి 24 న నాని పుట్టినరోజు కావడంతో ఈయనకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాని ఇండస్ట్రీలోకి రాకముందు ఏం పని చేసేవారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నాని ఇండస్ట్రీలోకి రాకముందు కొద్దిరోజుల పాటు రేడియో జాకీగా(Radio Jockey) పని చేశారని తెలుస్తోంది. ఇలా రేడియో జాకీగా కొనసాగుతూనే ఈయన సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక కెరియర్ మొదట్లో పలువురు సీనియర్ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన సినీ ప్రయాణం..

ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ఈయన ప్రయాణం 2008 లో అష్టా చెమ్మా అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాని తదుపరి సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న ఈయన నిర్మాతగా మారి తనలా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వారికి అవకాశాలు కల్పిస్తూ నిర్మాతగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ (The Paradise)సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఆగస్టు 21న ది ప్యారడైజ్ విడుదల..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శర వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను మార్చి 26వ తేదీ విడుదల చేయాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో తిరిగి ఆగస్టు 21 వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో నాని ఎప్పుడూ లేనివిధంగా విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ నటిస్తున్నారు.

Also Read: Actor Venkatesh: దృశ్యం3 నుంచి తప్పుకున్న వెంకటేష్..అదే ప్రధాన కారణమా?

Related News

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

Big Stories

×