E-Paper
Advertisement

సెల్ఫీ ప్రియులకు పండగే.. 50MP ఫ్రంట్ కెమెరాతో Motorola Edge 70 Pro లాంచ్ కన్ఫర్మ్!

సెల్ఫీ ప్రియులకు పండగే.. 50MP ఫ్రంట్ కెమెరాతో Motorola Edge 70 Pro లాంచ్ కన్ఫర్మ్!
Advertisement

Motorola Edge 70 Pro: సాధారణంగా మంచి బ్రాండ్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది మోటరోలా ఫోన్లు. మరీ ముఖ్యంగా Edge సిరీస్‌తో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను రీజనబుల్ ధరకే ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటోందీ సంస్థ. ఈ క్రమంలోనే ఏప్రిల్ 22న Motorola Edge 70 Proను ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. కెమెరా దగ్గర నుంచి బ్యాటరీ వరకు అన్నీ ప్రీమియం రేంజ్‌లో ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. ఆ వివరాలేంటో ఒకసారి చూసేద్దాం రండి..

ఈ Motorola Edge 70 Pro చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో రాబోతోంది. 6.7 అంగుళాల కర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్ వల్ల ఫోన్ పట్టుకుంటే చాలా రిచ్‌గా అనిపిస్తుంది. రీల్స్ స్క్రోలింగ్, సినిమాలు చూసినా చాలా స్మూత్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్ నాలుగు వైపులా వంపు తిరిగి ఉండటం వల్ల చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. పైగా నీళ్లు పడినా, దుమ్ము తగిలినా ఏం కాకుండా ఐపీ రేటింగ్ కూడా ఇచ్చారట.

Advertisement

Also Read: టీవీ అంటే ఇలా ఉండాల్రా బాబూ.. 115 ఇంచుల భారీ స్క్రీన్‌తో Samsung Micro RGB లాంచ్!

అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు దూరాన ఉన్న వాటిని క్లియర్‌గా తీసేందుకు టెలిఫోటో లెన్స్‌ను కూడా పెట్టారు. ఇక సెల్ఫీల విషయానికి వస్తే.. ఏకంగా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. దీనివల్ సెల్ఫీలు చాలా షార్ప్‌గా వస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ ఉండటం వల్ల గేమ్స్ ఆడినా, ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా దూసుకుపోతుంది.

Advertisement

చాలామందికి ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే టెన్షన్ ఉంటుంది. కానీ ఇందులో 6,500mAh భారీ బ్యాటరీ ఉంది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. ఇక 100W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నిమిషాల్లోనే ఫోన్ ఛార్జింగ్ ఎక్కిపోతుంది. దీనికి కేబుల్స్‌తో పనిలేకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా వాడుకోవచ్చు.

ఇక రేటు విషయానికి వస్తే.. Motorola Edge 70 Pro రూ.31,999 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. తక్కువ ధరలో మంచి పవర్, మంచి కెమెరా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

Also Read: పర్పుల్ లుక్‌, 10,000mAh భారీ బ్యాటరీ.. అబ్బా ఏముంది మావా ఈ Vivo Y600 Pro స్మార్ట్‌ఫోన్!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×