E-Paper
Advertisement

అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్… బిగ్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న అట్లీ.. ఫాన్స్ కు పూనకాలే..

అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్… బిగ్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న అట్లీ.. ఫాన్స్ కు పూనకాలే..
Advertisement

Allu Arjun -Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈయన తన 22వ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా AA 22 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి అయినట్టు సమాచారం.

బన్నీ బర్త్ డే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..

ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఒక్క చిన్న విషయం కూడా బయటకు రాకుండా అట్లీ ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుంది అంటూ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ సర్ప్రైజ్ రాబోతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు పోస్టర్ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

అల్లు అర్జున్ జోడిగా దీపిక పదుకొనే…

Advertisement

ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు బన్నీ పుట్టినరోజు స్పెషల్ ట్రీట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు అట్లీ ఎలాంటి టైటిల్ పెట్టి ఉంటారు ఈ సినిమా జోనర్ ఏంటి అని పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్గా ఎంపికయ్యారు అయితే ఈమె కాకుండా మరి కొంతమంది హీరోయిన్లు కూడా నటిస్తున్నారు అంటూ రోజుకొక హీరోయిన్ పేరు తెరపైకి వస్తుంది కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎక్కడ వెల్లడించలేదు.

2027 లో AA 22 రిలీజ్..

Advertisement

మరి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నింటికీ పులి స్టాప్ పడాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాయి అభ్యంక్కర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు . ఇక ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని అల్లు అర్జున్ తిరిగి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

Also Read: మళ్లీ వాయిదా పడిన పెద్ది..కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే..ఈసారైనా కన్ఫర్మ్ గా వస్తాడా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×