Pruthvi Raj Sukumaran: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Pruthvi Raj Sukumaran) ఒకరు. ఈయన పేరుకే మలయాళీ నటుడు అయినప్పటికీ ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు అన్ని భాషలలో విడుదల అవ్వడమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సలార్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న పృథ్వీరాజ్ ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి(Rajamouli) వారణాసి(Varanasi) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
రాజమౌళి కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వారణాసి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక రాజమౌళి సినిమా అంటే ఆయన సినిమాకు కమిట్ అవుతూ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వరకు ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులు ఇతర సినిమాలలో నటించడానికి అవకాశం ఉండదు. ఇలా రాజమౌళి సినిమా కోసం ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు కొన్ని సంవత్సరాల పాటు ఆయన సినిమాలకి కాల్ షీట్స్ అంకితం ఇచ్చారు.
ఇలా రాజమౌళి సినిమా అంటే ఇతర సినిమాలను చేయడానికి వీలు ఉండదు అనే సాంప్రదాయం ఉండేది కానీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం ఆ సాంప్రదాయానికి బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్ వారణాసి సినిమాలో కుంభ అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఇటీవల ఈయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిన విషయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజ్ కు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈయన వారణాసి సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు ఇతర భాషలలో కమిట్ అయిన తొమ్మిది సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసినట్టు సమాచారం.
ఇలా రాజమౌళి సినిమాలో నటిస్తూనే మరోవైపు తొమ్మిది సినిమాలను పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది పృథ్వీరాజ్ కు నటన పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనం అని చెప్పాలి. సాధారణంగా రాజమౌళి సినిమాకు లాక్ అయితే ఇతర సినిమాలు చేయడానికి వీలుండదు కానీ ఈయన మాత్రం రాజమౌళి సినిమాతో పాటు మరో తొమ్మిది సినిమాలను పూర్తి చేయడం అంటే ఇదొక అద్భుతమైన రికార్డు అనే చెప్పాలి. ఇక వారణాసి సినిమాలో ఈయన విలన్ గా కుంభ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇదివరకే కుంభ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.
Also Read: జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ.. నాగవంశీ ఫ్యాన్సీ ఆఫర్!