Tharun Bhascker -Eesha Rebba: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈషా రెబ్బా (Eesha Rebba)ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈమె గత కొద్ది రోజులుగా ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ తో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ జంటగా సినిమాలు చేయడం ఒకే చోట కలిసి పండుగలు జరుపుకోవడం, ఇద్దరూ కలిసి వెకేషన్ లకు వెళ్లడం వంటివి చేయడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అందరూ భావిస్తున్నారు.
ఇలా తరుణ్ భాస్కర్(Tharun Bhascker) ఈషా రెబ్బా రిలేషన్ కి సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ జంట మాత్రం ఎక్కడా ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి అధికారకంగా ప్రకటించలేదు. ఇకపోతే తాజాగా మరోసారి వీరిద్దరు జంటగా కనిపించడంతో తెరపైకి వీరి రిలేషన్ రూమర్స్ వచ్చాయి. నేడు వినాయక చవితి పండుగ కావడంతో సెలబ్రిటీలు అందరూ కూడా ఈ పండుగకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తరుణ్ భాస్కర్ సైతం తన ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
ఈ ఫోటోలో భాగంగా తరుణ్ భాస్కర్ తో పాటు ఈషా రెబ్బ కూడా ఉండటం గమనార్హం.ఇలా వీరిద్దరూ కలిసి తరుణ్ భాస్కర్ ఇంట్లోనే ఈ పండుగను జరుపుకోవడంతో త్వరలోనే వీరిద్దరూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలుస్తోంది .అయితే ఇలా వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఇప్పటివరకు స్పందించకపోవడంతో అభిమానులు స్పందిస్తూ ఇప్పటికైనా మీ రిలేషన్ కన్ఫామ్ చేయండయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బాతో రిలేషన్ లో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోవడానికి కారణం ఉందని తెలుస్తోంది.
తరుణ్ భాస్కర్ తమ రిలేషన్ గురించి చెప్పకపోవడానికి కారణం తన మొదటి భార్య అని సమాచారం. తరుణ్ భాస్కర్ కు ఇదివరకే వివాహం జరిగింది. లతా నాయుడు అనే అమ్మాయిని ప్రేమించి 2014 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట 2022లో వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి కానీ వీరి విడాకుల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని, కోర్టు నుంచి విడాకులు అధికారకంగా వస్తే అనంతరం ఈశా రెబ్బతో తన రిలేషన్ అధికారకంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఇక లతా నాయుడు తరుణ్ భాస్కర్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారని తెలుస్తోంది.
Also Read: రాజమౌళితో సినిమా అరుదైన రికార్డు సాధించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ !