Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 అప్పుడే రెండవ వారంలోకి అడుగుపెట్టేసింది. మొదటి వారంలో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఇద్దరు కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేశారు బిగ్ బాస్. ఇప్పుడు మళ్లీ రెండవ వారం నామినేషన్స్ అనగానే కంటెస్టెంట్స్ లో దడ మొదలైంది. ఈ వారం కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట బయటకు పంపించేస్తారా ? లేక వారాంతంలో ఎలిమినేట్ చేస్తారా? అనే భయం వారిలో చుట్టుకుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఎట్టకేలకు రెండవ వారానికి ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది . ఇందులో కంటెస్టెంట్ల మధ్య పోటీ భారీగా నెలకొనడమే కాకుండా అందరూ ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.
ముఖ్యంగా సోమవారం రావడంతో నామినేషన్ల హంగామా మొదలైంది. ఈసారి పెద్ద దిమ్మెకు తాడు చుట్టి ఉంటుంది. ఇద్దరు ఒకేసారి వెళ్లి ఆ తాడును విప్పాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా తాడును పూర్తిగా తొలగిస్తారో వాళ్లకు నామినేషన్ చేసే అవకాశం లభిస్తుంది . ఇలా చాన్స్ దక్కించుకున్న సుదీర్.. త్రిగుణ్ ను నామినేట్ చేశాడు. గేమ్ కూడా జరగకుండానే చైత్ర పేరును నువ్వు చెప్పడం నాకు నచ్చలేదనే కారణం చెప్పాడు. ఇక అలాగే వాష్ రూమ్ క్లీన్ చేయమని పని ఇస్తే.. అది చేయకుండా తన పవర్ ను వేస్ట్
చేసుకున్నావ్ అని షాలినిని కూడా నామినేట్ చేశాడు.
అంతేకాదు దేబ్జానీ కూడా త్రిగుణ్ ను నామినేట్ చేసింది. రోహిత్ కూడా త్రిగుణ్ తో పాటు ఝాన్సీ ని నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతోందని , ఏ డిస్కషన్ లో కూడా తనకు కనిపించట్లేదని ఝాన్సీ పేరు చెప్పాడు. అలా హౌస్ లో 14 మంది ఉండగా ..వీళ్ళల్లో చాలామంది త్రిగుణ్ ను టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం సంచలనంగా మారింది. ఇంతమంది ఒక్కరినే టార్గెట్ చేస్తున్నారా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ:ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!
ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన వాళ్ళ విషయానికి వస్తే.. 14 మందిలో 10 మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. షాలిని , ఝాన్సీ, త్రిగుణ్ , కృష్ణుడు, రాంప్రసాద్, సుధీర్, వర్షిని ,రోహిత్, ముకేష్, దేబ్జానీ ఈ లిస్టులో ఉన్నారట.
ఈవారం నరేష్ , వంశీ , సృష్టి , అమన్ నామినేట్ కాకుండా సేఫ్ జోన్ లో ఈ వారం బయటపడినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే నామినేషన్స్ రచ్చ మొదలయ్యిందో లేదో అప్పుడే 10 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. మరి ఈ పదిమందిలో ఆడియన్స్ సపోర్టు ఎవరికి ఉండనుంది? ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఓటింగ్ ప్రారంభం అవ్వగానే ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోతుందంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వారం కూడా ఇద్దరినీ పంపించేస్తారా? లేక ఒకరే బయటకు వెళ్తారా? అలా వెళ్లే ఆ ఒకరు ఎవరు? అనే విషయం ఉత్కంఠ గా మారింది.